TS Assembly Speaker : తెలంగాణ కొత్త స్పీకర్ ఆయనేనా..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. తెలంగాణ సీఎం రేవంత్.. ప్రమాణస్వీకారానికి సిద్ధం అవుతున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు.. కాంగ్రెస్ కీలక నేతలందర్నీ ఆహ్వానాలు వెళ్లాయి. ఎల్బీ స్టేడియంలో గురువారం చిన్నపాటి పండగ జరగబోతోంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. రేవంత్‌కు సీఎం పదవి ఇవ్వడంతో.. సీనియర్ల రియాక్షన్ ఏంటి, వాళ్లు నిజంగా కూల్ అయ్యారా లేదా అన్న సంగతి ఎలా ఉన్నా.. రేవంత్ కేబినెట్‌లో ఎవరు ఉండబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

Is he the new speaker of Telangana?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. తెలంగాణ సీఎం రేవంత్.. ప్రమాణస్వీకారానికి సిద్ధం అవుతున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు.. కాంగ్రెస్ కీలక నేతలందర్నీ ఆహ్వానాలు వెళ్లాయి. ఎల్బీ స్టేడియంలో గురువారం చిన్నపాటి పండగ జరగబోతోంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. రేవంత్‌కు సీఎం పదవి ఇవ్వడంతో.. సీనియర్ల రియాక్షన్ ఏంటి, వాళ్లు నిజంగా కూల్ అయ్యారా లేదా అన్న సంగతి ఎలా ఉన్నా.. రేవంత్ కేబినెట్‌లో ఎవరు ఉండబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ నేతల నుంచి భారీ పోటీ కనిపిస్తుంటే.. స్పీకర్ విషయంలో మాత్రం ఎవరు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. మాకొద్దంటే మాకొద్దని.. అందరూ దూరం జరుగుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
REVANTH REDDY: సీఎంగా రేవంత్.. స్వగ్రామంలో సంబరాలు..
దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో స్పీకర్ పదవి దక్కేది ఎవరికి అనే చర్చ జోరుగా సాగుతోంది. స్పీకర్ పదవి ప్రచారంలో తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరు బలంగా వినిపిస్తోంది. అయితే, శ్రీధర్ బాబు, రాజనర్సింహ తమకు స్పీకర్ వద్దంటే వద్దు అని క్లియర్‌కట్‌గా చెప్పేస్తున్నారు. ఐతే ఖమ్మం జిల్లాలో మంత్రి పదవులు దక్కే వారి లిస్ట్‌లో భట్టి విక్రమార్క, కూనంనేని సాంబశివరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉండటంతో.. తుమ్మల నాగేశ్వరరావుకే స్పీకర్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి ఎవరనే అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం తేల్చేసింది. మంత్రులు పేర్లను కూడా దాదాపు ఫైనల్ చేసింది. గురువారం రేవంత్ రెడ్డితో పాటు.. మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్ పదవి విషయంలోనే తేడా వస్తోంది. ఈ పదవిని స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. ఏం చేయాలని ఆలోచనలో పడ్డారు కాంగ్రెస్ నేతలు. దీంతో ఈ పదవి ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.