Sirisilla KTR : సిరిసిల్లలో కేటీఆర్‌కు పద్మశాలి టెన్షన్.. ఝలక్ తప్పదా.. ఏం జరగబోతోంది..
సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ విజయాన్ని అడ్డుకోవడం కష్టం కాదు.. అసాధ్యం కూడా..! ఇది చాలామంది నుంచి వినిపించే అభిప్రాయం. నిజానికి సిరిసిల్లను ఓ రేంజ్‌లో డెవలప్ చేసిన కేటీఆర్‌ను ఓడించేంత సీన్ ఉండదు అన్నది నిజం. ఐతే ఈసారి మాత్రం సిరిసిల్లలో కేటీఆర్‌కు కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని.. సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ విజయాన్ని అడ్డుకోవడం కష్టం కాదు.. అసాధ్యం కూడా..! ఇది చాలామంది నుంచి వినిపించే అభిప్రాయం. నిజానికి సిరిసిల్లను ఓ రేంజ్‌లో డెవలప్ చేసిన కేటీఆర్‌ను ఓడించేంత సీన్ ఉండదు అన్నది నిజం. ఐతే ఈసారి మాత్రం సిరిసిల్లలో కేటీఆర్‌కు కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని.. సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. 2009 ఎన్నికల్లో మొదటిసారి సిరిసిల్ల నుంచి పోటీ చేసిన కేటీఆర్.. చాలా తక్కువ ఓట్లతో విజయం సాధించారు. వందల ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది అప్పుడు. 2018 ఎన్నికల్లో మాత్రం 89వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో సిరిసిల్ల నుంచి గెలిచారు కేటీఆర్.
ఐతే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరగబోతోంది.. ఎంత మెజారిటీ వస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ మీద.. అదీ సిరిసిల్ల విషయంలో ఇలాంటి అనుమానాలకు కారణం.. పద్మశాలి సామాజికవర్గం. సిరిసిల్లలో పద్మశాలి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిరిసిల్ల నియోజకవర్గాన్ని కేటీఆర్ అభివృద్ధి పథంలో నడిపించారు. ఐతే సిరిసిల్ల నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ పరిణామాలు కేటీఆర్‌కు ఇబ్బందికరంగా మారుతున్నాయనే చర్చ జరుగుతోంది. పద్మశాలీలు బీఆర్ఎస్‌కు ఝలక్ ఇస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. రాష్ట్రవ్యాప్తంగా పద్మశాలి ఓటర్లు 4 లక్షలకు పైగా ఉన్నా. దీంతో తమ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలని, రాజకీయంగా ప్రాధాన్యం కల్పించాలని అన్ని పార్టీలను కోరుతున్నారు. ఇటీవల కోరుట్లలో జరిగిన పద్మశాలి మహాగర్జన సభలో అనేక తీర్మానాలు చేశారు.
ఈ సభలో లక్ష మందికి పైగా పద్మశాలీలు పార్టీలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేశారు. తమ సామాజికవర్గానికి గౌరవప్రదమైన సీట్లు కేటాయించాలని అన్ని పార్టీలకు అల్టిమేటం జారీ చేశారు. సీట్లు ప్రకటించని పార్టీకి తమ మద్దతు ఉండబోదని.. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పద్మశాలీలు ఎక్కడ నుంచి పోటీ చేసినా పార్టీలకు అతీతంగా మద్దతు పలకాలని సభలో తీర్మానించారు. సిరిసిల్లలో దాదాపు 80 వేలకు పైగా పద్మశాలీల ఓట్లు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు సిరిసిల్లలో పద్మశాలిలు అంతా ఏకమై.. కేటీఆర్‌కు వ్యతిరేకంగా మారితే ఇబ్బందులు తప్పకపోవచ్చనే చర్చ జరుగుతోంది. ట్రబుల్ షూటింగ్‌లో తనకంటూ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్న కేటీఆర్.. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.