Pragathi Bhavan : బద్దలైన కేసీఆర్ ప్రగతి భవన్ గోడలు..

మాజీ సీఎం కేసీఆర్ ముచ్చటపడి.. జనం సొమ్ముతో కట్టించుకున్న ఆ ప్రగతిభవన్ కోటలోకి సామాన్యులకు ప్రవేశం లేదు. సామాన్యులేమో గానీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా పర్మిషన్ లేదు. కేసీఆర్ లేదా కేటీఆర్.. ఎప్పుడైనా మీటింగ్ పెడితే తప్ప.. ప్రగతి భవన్ లోకి అడుగుపెట్టే అర్హత ఉండేది కాదు. ఇక ఈ బిల్డింగ్ ముందు రోడ్డును ఆక్రమించుకొని దాదాపు 13 అడుగుల ఎత్తయిన గోడ ఉండేది. దాని పక్కన ముళ్ళ కంచెలు ఉండేవి. దాంతో ప్రగతి భవన్ వైపు నుంచి సికింద్రాబాద్ వెళ్ళే వారికి ట్రాఫిక్ నరకం కనిపించేది. ఇప్పుడు అవన్నీ తొలగిపోతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 7, 2023 | 12:47 PMLast Updated on: Dec 07, 2023 | 12:47 PM

It Was The Congress Government That Broke The Walls Of Telanganas Former Chief Minister Kcr Pragathi Bhavan

మాజీ సీఎం కేసీఆర్ ముచ్చటపడి.. జనం సొమ్ముతో కట్టించుకున్న ఆ ప్రగతిభవన్ కోటలోకి సామాన్యులకు ప్రవేశం లేదు. సామాన్యులేమో గానీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా పర్మిషన్ లేదు. కేసీఆర్ లేదా కేటీఆర్.. ఎప్పుడైనా మీటింగ్ పెడితే తప్ప.. ప్రగతి భవన్ లోకి అడుగుపెట్టే అర్హత ఉండేది కాదు. ఇక ఈ బిల్డింగ్ ముందు రోడ్డును ఆక్రమించుకొని దాదాపు 13 అడుగుల ఎత్తయిన గోడ ఉండేది. దాని పక్కన ముళ్ళ కంచెలు ఉండేవి. దాంతో ప్రగతి భవన్ వైపు నుంచి సికింద్రాబాద్ వెళ్ళే వారికి ట్రాఫిక్ నరకం కనిపించేది. ఇప్పుడు అవన్నీ తొలగిపోతున్నాయి.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి : ప్రమాణ స్వీకారం LIVE UPDATES

కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కేసీఆర్ ప్రగతి భవన్ బద్దలు కొడతామన్న రేవంత్ రెడ్డి అన్నంత పనీ చేస్తున్నారు. ప్రగతి భవన్ ను అంబేద్కర్ ప్రజా భవన్ గా మారుస్తామన్నారు. గతంలో ప్రగతి భవన్ లోకి ఎవరూ రాకుండా ఏర్పాటు చేసిన గోడలు GHMC సిబ్బంది బద్దలు కొడుతున్నారు. ముళ్ళకంచెలను తీసేశారు. రోడ్డు డివైడర్ ను ఆక్రమించి ఐరన్ రాడ్స్ కట్టించిన ఈ గోడను తొలగించారు. రోడ్డును ఆక్రమించి గోడ కట్టడంతో ట్రాఫిక్ భారీగా జామ్ అయ్యేది. సీఎం నివాసం కావడంతో.. ట్రాఫిక్ సమస్యలతో జనం ఇబ్బంది పడుతున్నా.. పోలీసులు కూడా ఏమీ మాట్లాడేవారు కాదు. ఓ రకంగా చెప్పాలంటే.. హైదరాబాద్ సిటీ నడిబొడ్డున కేసీఆర్ గడీని నిర్మించుకున్నట్టుగా ఉండేది ప్రగతి భవన్.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతుండటంతో.. ప్రగతి భవన్ లో ఇక సామాన్యులకు కూడా ప్రవేశం ఉంటుంది. అందుకే ప్రగతి భవన్ ముందున్న గోడలు, కంచెలను తొలగించారు. ఇప్పటి వరకూ ప్రగతిభవన్ దగ్గర ఉన్న ట్రాఫిక్ ఆంక్షలను కూడా పోలీసులు తొలగించారు.. రేవంత్ చర్యపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది ప్రశ్నించే గొంతుకల మొదటి విజయం అంటున్నారు