Kaleshwaram project : కాంగ్రెస్‌కు ఆయుధంగా మారిన మేడిగడ్డ ప్రమాదం..
అధికార ప్రతిపక్షాలు అన్న తరువాత విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం కామన్. ఇవి కేవలం మాటల వరకు ఉంటే ఓకే. కానీ వీటికి ఆధారాలు కూడా తోడైతే రాజకీయం మరింత వేడెక్కుతుంది. ఇప్పుడు తెలంగాణలో అదే సీన్ కనిపిస్తోంది. కాళేశ్వరం విషయంలో ముందునుంచీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ ఒక్కటే. ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని.. ప్రజాధనం అయ్యిందని ఆరోపిస్తూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ.

Kaleswara Project Medigadda accidents are being used as a weapon in the run up to elections Telangana Congress
( Telangana elections ) అధికార ప్రతిపక్షాలు అన్న తరువాత విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం కామన్. ఇవి కేవలం మాటల వరకు ఉంటే ఓకే. కానీ వీటికి ఆధారాలు కూడా తోడైతే రాజకీయం మరింత వేడెక్కుతుంది. ఇప్పుడు తెలంగాణలో అదే సీన్ కనిపిస్తోంది. కాళేశ్వరం విషయంలో ముందునుంచీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ ఒక్కటే. ( Kaleswara Project ) ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని.. ప్రజాధనం అయ్యిందని ఆరోపిస్తూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మేడిగడ్డ ( Medigadda ) బ్రిడ్జ్ కుంగడం, నాణ్యతా లోపం వల్లే ఇలా జరిగిందని రిపోర్ట్ రావడం, ఇవన్నీ కాంగ్రెస్‌కు అస్త్రాలుగా మారుతున్నాయి. సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల నుంచి నిన్న రిపోర్ట్ వచ్చిందో లేదో.. ఇవాళ బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ కాళేశ్వరాన్ని ఏటీఎంలా వాడుకున్నారని.. ఈ వ్యవహారంలో కేంద్రం విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు.
REVANTH REDDY: కేసీఆర్ ఒక ఆర్థిక ఉగ్రవాది.. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కోట్లు దోపిడీ: రేవంత్ రెడ్డి
ఇక్కడ బీఆర్‌ఎస్ (BRS ) ను మాత్రమే కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కూడా రేవంత్ టార్గెట్ చేశారు. తాము అడిగిన సమాచారాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదంటూ డ్యామ్ సేఫ్టీ కమిటీ చాలా క్లియర్‌గా రిపోర్ట్‌లో చెప్పింది. 20 అంశాల్లో వివరాలు అడిగితే.. 11 అంశాల్లో మాత్రమే వివరాలు ఇచ్చారంటూ చెప్పింది. అక్టోబర్ 29లో సమాచారం ఇవ్వకపోతే ఆయా విషయాల్లో సమాచారం లేదని భావించాల్సి ఉంటుందని చెప్పింది. వాళ్లు చెప్పినట్టే ఇచ్చిన గడువులోపు ప్రభుత్వం నుంచి వివరాలు అందలేదు. నిజానికి ఇది డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం చట్ట విరుద్ధం. చర్యలు తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కానీ కేంద్రం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇదే విషయాన్ని రేవంత్ పాయింట్ అవుట్ చేశారు. చర్యలు తీసుకునే చాన్స్ ఉన్నా కేంద్ర ప్రభుత్వం సైలెంట్‌గా ఉందని ప్రశ్నించారు. ఢిల్లీలో బీఆర్‌ఎస్, బీజేపీ దోస్తీ నడుస్తోందని చెప్పేందుకు ఇదొక్కటి చాలంటూ రెండు పార్టీలను టార్గెట్ చేశారు. ఒకరి తప్పులను ఒకరు కవర్ చేస్తూ తెలంగాణ ప్రజలను అమాయకులను చేస్తున్నారంటూ మాటల తూటాలు వదిలారు. రేవంత్ కామెంట్స్‌ను ఇప్పుడు బీఆర్‌ఎస్, బీజేపీ ఎలా డిఫెండ్ చేస్తాయో చూడాలి.