Ramya Rao Regulapati: రాబోయేది కాంగ్రెస్ పాలనే: కల్వకుంట్ల రమ్యా రావు
నాలుగు కోట్ల ప్రజలు బాగుపడడమే తన ధ్యాస, శ్వాస అని పాదయాత్ర చేసిన మహనీయుడు భట్టి. నాటి వైయస్సార్ మరో రూపమే నేటి భట్టి విక్రమార్క. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలకు వైఎస్ఆర్ సేవలందించినట్టుగా, కార్యకర్తలకు భరోసా ఇచ్చినట్టుగా, తెలంగాణ ప్రజలకు భట్టి సేవలందిస్తారు.
Ramya Rao Regulapati: తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ పాలనే అని అన్నారు ఆ పార్టీ నేత కల్వకుంట్ల రమ్యా రావు. మంగళవారం ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో భట్టి విక్రమార్కకు మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచారంలో రమ్యా రావు పాల్గొన్నారు. ఈ ప్రచారంలో మహిళలు, యువకులు భట్టి విక్రమార్కకు, రమ్యా రావుకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. “రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రాబోతుంది. భట్టి విక్రమార్కకు వైయస్సార్ లాంటి గొప్ప పదవి రాబోతుంది. ఇందిరమ్మ రాజ్యం కావాలని వైయస్సార్ మాదిరిగా తెలంగాణలో భట్టి విక్రమార్క పాదయాత్ర నిర్వహించారు. మండుటెండలో తల మాడినా, జ్వరం వచ్చినా, కాళ్ళు బొబ్బలెక్కినా, ప్రజలే తన ప్రాణమని, ప్రాణాలకు తెగించి ప్రజల కోసం పాదయాత్ర చేసిన గొప్ప నాయకుడు భట్టి.
KCR: కేసీఆర్‌కు షాకిచ్చిన స్టాలిన్.. కాంగ్రెస్‌కే మద్దతు..!
నాలుగు కోట్ల ప్రజలు బాగుపడడమే తన ధ్యాస, శ్వాస అని పాదయాత్ర చేసిన మహనీయుడు భట్టి. నాటి వైయస్సార్ మరో రూపమే నేటి భట్టి విక్రమార్క. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలకు వైఎస్ఆర్ సేవలందించినట్టుగా, కార్యకర్తలకు భరోసా ఇచ్చినట్టుగా, తెలంగాణ ప్రజలకు భట్టి సేవలందిస్తారు. కార్యకర్తలకు భరోసాగా నిలుస్తారు. భట్టి విక్రమార్క గెలవడం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. అందుకే ప్రచారానికి వచ్చాను. ఎన్నికల ప్రచారంలో భట్టి విక్రమార్క ప్రచార రథం పైన కిలోల కొద్ది బంతిపూల వర్షం కురిపించినట్టూ.. మీ ఓట్లు వరదలు కురిపించాలి. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించి కానుకగా ఇద్దాం. కారు పార్టీవి కారు కూతలు. ప్రజలను మభ్యపెట్టే మాటలు. మధిరలో భట్టికి పోటీ ఇచ్చే స్థాయి కమల్ రాజుకు ఉన్నదా..?
మధిరలో భట్టికి పోటీ లేరు. సాటి లేరు. భట్టిపై పోటీ పెట్టడానికి కేసీఆర్ 3 నిద్రలేని రాత్రులు గడిపారు. ఎంత ఆలోచన చేసినా పోటీకి నిలపడానికి ఎవరు దొరకకపోవడంతో బోడి లింగాల్లో ఈడో లింగాన్ని నిలబెట్టిండు. మధిరలో కేసీఆర్ నిలబెట్టిన లింగం.. పడిపోయే లింగమే” అని రమ్యా రావు వ్యాఖ్యానించారు.