Kasani Gnaneshwar: బీఆర్ఎస్‌లోకి కాసాని జ్ఞానేశ్వర్.. అక్కడి నుంచి పోటీ..
ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసానికి.. తెలంగాణవ్యాప్తంగా ఆ సామాజిక వర్గంలో గట్టిపట్టు ఉంది. దీంతో ఆయనను చేర్చుకునేందుకు అన్ని పార్టీలు అనేక ఆఫర్లు ఇచ్చాయ్. ఐతే బీఆర్ఎస్‌లో చేరాలని కాసాని నిర్ణయం తీసుకున్నారు.
Kasani Gnaneshwar: తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ (TDP) పోటీ చేయకూడదని పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్న తర్వాత.. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ (Kasani Gnaneshwar) హర్ట్ అయ్యారు. సైకిల్ పార్టీకి, అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు కారెక్కేందుకు సిద్ధం అవుతున్నారు. టీడీపీ పోటీలో లేకపోతే లాభం ఎవరికి.. సీమాంధ్రుల ఓట్లు ఎవరికి వెళ్తాయ్.. ఏం జరుగుతుంది అన్న సంగతి పక్కనపెడితే.. కాసాని ఇప్పుడేం చేయబోతున్నారు.. అసెంబ్లీ బరిలో నిలుస్తారా, లేదంటే ఎమ్మెల్సీ తీసుకొని సైలెంట్ అవుతారా అని రకరకాల చర్చ సాగుతోంది.
JANASENA: వెనక్కి తగ్గిన పవన్..? తెలంగాణలో జనసేన పోటీ కష్టమే..!
ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసానికి.. తెలంగాణవ్యాప్తంగా ఆ సామాజిక వర్గంలో గట్టిపట్టు ఉంది. దీంతో ఆయనను చేర్చుకునేందుకు అన్ని పార్టీలు అనేక ఆఫర్లు ఇచ్చాయ్. ఐతే బీఆర్ఎస్ (BRS)లో చేరాలని కాసాని నిర్ణయం తీసుకున్నారు. ఐతే ఇప్పటికే ఇప్పటికే పార్టీ తరఫున అభ్యర్థుల ప్రకటన పూర్తి కావడంతో.. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ.. లేదంటే మరో కీలక పదవి ఇచ్చేందుకు కేసిఆర్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఐతే కాసాని మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఐతే కాసాని ఆసక్తిని లెక్కలోకి తీసుకొని.. బీఆర్ఎస్ భారీ ప్లాన్ చేసింది. తెలంగాణలో ముదిరాజ్ సామాజికవర్గానికి 50లక్షల ఓట్లు ఉన్నాయ్. ఐతే బీఆర్ఎస్ ఒక్క టికెట్ ఆ సామాజికవర్గానికి కేటాయించలేదు. దీంతో కాసానికి టికెట్ ఇవ్వడం ద్వారా.. ఆ లోటు భర్తీ చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ముదిరాజ్ సంఘానికి పెద్దదిక్కుగా వ్యవహరించిన కాసాని జ్ఞానేశ్వర్‌కు గోషామహల్ టికెట్ ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం.
BJP-JANASENA: బీజేపీలో జనసేన చిచ్చుపెట్టిందా..? ఆ 31 స్థానాలు పెండింగ్‌లో ఎందుకు..?
ఇప్పటికే ఇక్కడ బీజేపీ తమ పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ప్రకటించింది. బీఆర్ఎస్ ఇప్పటివరకు క్యాండిడేట్‌ను అనౌన్స్ చేయలేదు. దీంతో జ్ఞానేశ్వర్‌కు టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాసానికి టికెట్ ఇవ్వడం ద్వారా ముదిరాజ్ సామాజికవర్గ ఓటర్ల మనసు గెలిచే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. గోషామహల్‌లో కాసాని గెలిస్తే పర్లేదు.. ఓడినా ఆ తర్వాత కీలక పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది.