KCR houses : కేసీఆర్ ఆ ఇల్లూ ఖాళీ చేయాల్సిందే..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రిజైన్ చేసిన కేసీఆర్.. వాస్తు ప్రకారం ముచ్చటపడి కట్టించుకున్న ప్రగతి భవన్ ను ఖాళీ చేసి.. గజ్వేల్ ఫామ్ హౌస్ కు వెళ్ళారు. సెక్యూరిటీ సిబ్బంది కూడా లేకుండా ఎంపీ సంతోష్ తెచ్చిన కారులో వెళ్ళిపోయారు. ప్రగతి భవన్ మాత్రమే కాదు.. ఇప్పుడు ఢిల్లీలోనూ గవర్నమెంట్ ఎలాట్ చేసిన ఇంటిని దాదాపు 20యేళ్ళ తర్వాత ఖాళీ చేయాల్సి వస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రిజైన్ చేసిన కేసీఆర్.. వాస్తు ప్రకారం ముచ్చటపడి కట్టించుకున్న ప్రగతి భవన్ ను ఖాళీ చేసి.. గజ్వేల్ ఫామ్ హౌస్ కు వెళ్ళారు. సెక్యూరిటీ సిబ్బంది కూడా లేకుండా ఎంపీ సంతోష్ తెచ్చిన కారులో వెళ్ళిపోయారు. ప్రగతి భవన్ మాత్రమే కాదు.. ఇప్పుడు ఢిల్లీలోనూ గవర్నమెంట్ ఎలాట్ చేసిన ఇంటిని దాదాపు 20యేళ్ళ తర్వాత ఖాళీ చేయాల్సి వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో.. కేసీఆర్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రమే.. ప్రగతి భవన్ ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు ఢిల్లీలోని తన అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నారు. 2004లో కరీంనగర్ ఎంపీగా గెలిచి.. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ టైమ్ లో కేంద్రమంత్రి హోదాలో తుగ్లక్ రోడ్ లోని టైప్ 8 క్వార్టర్ ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.
2006లో కేంద్ర మంత్రి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన కేసీఆర్.. ఉపఎన్నికల్లో ఎంపీగా గెలిచి మళ్ళీ అదే ఇంట్లో కొనసాగారు. 2009లో మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా ఎన్నికైనా, చివరకు 2014 నుంచి సీఎంగా కొనసాగుతున్నా.. కేసీఆర్ ఆ ఇంటినే ఎంపిక చేసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా తుగ్లక్ లైన్‌లోని ఇంట్లోనే ఉండేవారు. అన్ని రాష్ట్రాల సీఎంలకు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అధికారిక నివాసాల్ని కేటాయిస్తుంది. వివిధ పనుల కోసం ఢిల్లీ వచ్చినప్పుడు సీఎంలు ఉండేందుకు వీలుగా వీటిని ఎలాట్ చేస్తారు. ఆయన కూతురు.. కవిత ఎంపీగా ఉన్నప్పుడు కూడా అప్పట్లో అదే ఇంటిని వాడుకున్నారు. ఇప్పుడు తెలంగాణ సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. దాంతో 20యేళ్ళుగా ఉంటున్న తుగ్లక్ రోడ్ లోని ఇంటిని కేసీఆర్ ఖాళీ చేయాల్సి వస్తోంది. అయితే సీఎం పదవి కోల్పోయిన వాళ్లు ఇల్లు ఖాళీ చేసేందుకు నెల రోజుల టైమ్ ఉంటుంది. ఈ లెక్కన కేసీఆర్.. ఢిల్లీలోని ఇంటిని మరో నెల పాటు వాడుకోవచ్చు. అయినప్పటికీ, నివాసాన్ని ఖాళీ చేస్తామనీ.. అందుకోసం 3 రోజులు టైమ్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ అధికారులను కోరింది. గడువులోగా ఆ ఇంటిని కేసీఆర్ ఖాళీ చేయాలని నిర్ణయించారు.