BRS Party : పెండింగ్‌లోనే ఇంకా ఆ 5 స్థానాలు.. కేసీఆర్ మనసులో ఏముంది..?
అభ్యర్థులతో భేటీ అయిన కేసీఆర్.. పనిలో పనిగా పెండింగ్‌లో ఉన్న నాలుగు స్థానాలకు, మైనంపల్లి హ్యాండ్ ఇచ్చిన మల్కాజ్‌గిరికి అభ్యర్థులను ప్రకటిస్తారని అనుకున్నారు అంతా ! కట్ చేస్తే ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోగా.. మరో ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్చే చాన్స్ ఉందనే ప్రచారం కొత్తగా తెరమీదకు వచ్చింది.

KCR who met the candidates Unannounced candidates for the four pending positions
అభ్యర్థులతో భేటీ అయిన కేసీఆర్.. పనిలో పనిగా పెండింగ్‌లో ఉన్న నాలుగు స్థానాలకు, మైనంపల్లి హ్యాండ్ ఇచ్చిన మల్కాజ్‌గిరికి అభ్యర్థులను ప్రకటిస్తారని అనుకున్నారు అంతా ! కట్ చేస్తే ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోగా.. మరో ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్చే చాన్స్ ఉందనే ప్రచారం కొత్తగా తెరమీదకు వచ్చింది. దీంతో పెండింగ్ స్థానాల్లో అభ్యర్థులకు సంబంధించి సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల షెడ్యూల్‌కు 50రోజుల ముందే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఐతే వీటిలో మల్కాజ్‌గిరి అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్‌లో చేరడంతో.. ఆ నియోజకవర్గం పెండింగ్‌లో ఉంది.
బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేయడంతో పాటు అభ్యర్థులకు కేసీఆర్.. బీఫామ్స్ అందించారు. దీంతో పెండింగ్‌లో ఉన్న ఐదు నియోజకవర్గాలకు ప్రకటిస్తారని భావించారు. ఐతే అలా జరగలేదు. నర్సాపూర్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి, జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డిని కేసీఆర్ కన్ఫార్మ్ చేశారనే ప్రచారం జరిగింది. గోషామహల్ నుంచి మార్వాడి మరాఠీలకు టికెట్ ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకుంటారని అనుకున్నారు. ఐతే ఎలాంటి ప్రకటన రాలేదు. మరి ఈ ఐదు స్థానాలకు అభ్యర్థులను ఎప్పుడు ఫైనల్ చేస్తారు అనే టెన్షన్ కనిపిస్తోంది.
నామినేషన్ గడువుకు ఒక్కరోజు ముందు మాత్రమే అనౌన్స్ చేస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయ్. ఆ ఐదు స్థానాల్లో పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు..అందుకే కేసీఆర్ ఆలస్యం చేస్తున్నారా అనే చర్చ కూడా సాగుతోంది. ముత్తిరెడ్డిని ఆర్టీసీ చైర్మన్ చేసిన తర్వాత.. పల్లాకు రూట్ క్లియర్ అయింది అనుకుంటే.. మధ్యలో పొన్నాల ఎంట్రీ ఇచ్చారు. ఇక మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ నుంచి కారులోకి భారీగా వలసలు వచ్చాయ్. నర్సాపూర్‌లోనూ మదన్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి వర్గాల మధ్య యుద్ధం ఇంకాచల్లారిన పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఇంకా పెండింగ్‌లో ఉంచారనే ప్రచారం జరుగుతోంది.