TELANGANA ASSEMBLY ELECTIONS: రాహుల్ గాంధీ బైక్ ర్యాలీలో ప్రమాదం.. కొండా సురేఖకు గాయాలు..
కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసిన నిర్వహించిన బైక్ ర్యాలీలో కొండా సురేఖ ప్రమాదానికి గురయ్యారు. ఆమె బైక్ అదుపుతప్పి కిందపడిపోవడంతో గాయాలపాలయ్యారు. వందల సంఖ్యలో బైక్‌లు వెళ్తున్న క్రమంలో, ఒక బైక్ అదుపుతప్పి ఢీకొంది. దీంతో కొండా సురేఖ కూడా బైక్ ప్రమాదానికి గురయ్యారు.
TELANGANA ASSEMBLY ELECTIONS: వరంగల్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత కొండా సురేఖ గురువారం గాయపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భూపాలపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసిన నిర్వహించిన బైక్ ర్యాలీలో కొండా సురేఖ ప్రమాదానికి గురయ్యారు. ఆమె బైక్ అదుపుతప్పి కిందపడిపోవడంతో గాయాలపాలయ్యారు. వందల సంఖ్యలో బైక్‌లు వెళ్తున్న క్రమంలో, ఒక బైక్ అదుపుతప్పి ఢీకొంది. దీంతో కొండా సురేఖ కూడా బైక్ ప్రమాదానికి గురయ్యారు.
ఆమె స్వయంగా బైక్ నడుపుతున్నప్పుడే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సురేఖ గాయాలపాలై కింద పడ్డ సురేఖను వెంటనే ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆమె ముఖం, చేతులకు గాయాలయ్యాయి. చాలా కాలంగా సురేఖ బైక్ నడపలేదు. అయితే, ఉత్సాహంతో రేఖ బైక్ నడిపేందుకు ప్రయత్నించడం వల్లే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఆమెకు స్వల్ప గాయాలే అయ్యాయని, ప్రమాదం లేదని కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి. ఘటన అనంతరం కొండా మురళి కూడా పక్కనే ఉండి ఆమెకు వైద్య సేవలు అందేలా చూస్తున్నారు. సురేఖను చూసి కొండా మురళి భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ రోజు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర కొనసాగుతుంది. రెండోరోజు భూపాలపల్లి నుంచి కాటారం వరకు కొనసాగనుంది.
కేటీకే 5వ గని నుంచి బాంబుల గడ్డ వరకు రాహుల్ గాంధీ నిరుద్యోగులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. తాజా బస్సు యాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ నేత మధుయాష్కీసహ పలువురు నేతలు పాల్గొన్నారు. బస్సు యాత్ర ద్వారా తమ పార్టీకి మైలేజ్ పెరుగుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. రాహుల్ గాంధీ బస్సు యాత్రలో పాల్గొనడం కలిసొస్తోంది.