KTR: రాహుల్‌ గాంధీ లీడర్ కాదు రీడర్.. కేటీఆర్ కౌంటర్..

కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగింది అంటున్నారు. ఈ ప్రాజెక్టు కట్టిందే రూ.80 వేల కోట్లతో. అలాంటిది లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది? రాహుల్ పక్కనున్న రేవంత్ రెడ్డి అవినీతి పరుడు కాదా? రేవంత్ రెడ్డి ఒక 420. రేవంత్ రెడ్డి కంటే అవినీతి పరుడు ఎవరూ లేరు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 19, 2023 | 05:59 PMLast Updated on: Oct 19, 2023 | 5:59 PM

Ktr Fires On Rahul Gandhi And Congress

KTR: బీఆర్ఎస్‌పై, కేసీఆర్‌పై విమర‌్శలు చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ లీడర్ కాదు రీడర్ అని విమర్శించారు. కుటుంబ పాలన గురించి చెబుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ.. వీళ్లంతా ఒక కుటుంబం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

‘‘కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగింది అంటున్నారు. ఈ ప్రాజెక్టు కట్టిందే రూ.80 వేల కోట్లతో. అలాంటిది లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది? రాహుల్ పక్కనున్న రేవంత్ రెడ్డి అవినీతి పరుడు కాదా? రేవంత్ రెడ్డి ఒక 420. రేవంత్ రెడ్డి కంటే అవినీతి పరుడు ఎవరూ లేరు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. రేప‌టి రోజున అల్టిమేట్‌గా కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచినా మళ్ళీ బీజేపీలో చేరుస్తాడు రేవంత్ రెడ్డి. బీజేపీ కోవర్ట్ రేవంత్ రెడ్డి. గంప గుత్తగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి చేరుస్తాడు. రాహుల్‌కు తెలియ‌క గాడ్సేకు గాంధీ భ‌వ‌న్‌ను అప్ప‌జెప్పారు. ఆకాశం నుంచి భూమి లోపలి దాకా ఏ టూ జెడ్ అన్ని కుంభకోణాలు చేసింది కాంగ్రెస్. కుంభ‌కోణాల్లో స్వ‌యంగా కాంగ్రెస్ కేంద్ర మంత్రులు జైళ్ల‌కు పోయారు. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద ఈడీ విచార‌ణ జ‌రుగుతోంది. మేము బీజేపీ బీ టీమ్ కాదు. మీరే సీ టీమ్. సీ అంటే చోర్ టీమ్. ఈ కాంగ్రెస్ పార్టీకి సిగ్గుందా?

ఫ్లోరోసిస్‌తో అల్లాడుతున్న నల్లగొండకు చేసిందేమీ లేదు. ఇంకో ఛాన్స్ ఇవ్వండి అని అడుక్కుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి 11 సార్లు ఛాన్స్ ఇస్తే మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. ఎన్నికల్లో ఆగమాగం అయ్యి ఓట్లు వేయకండి. ఎక్కడిక్కడ కాంగ్రెస్‌ను నిలదీయాలి’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే మాటల యుద్ధం కొనసాగుతోంది.