Congress Government : కొత్త ప్రభుత్వానికి ఎన్నో సవాళ్లు..

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ సర్కార్ ముందు ఎన్నో సవాళ్ళు రెడీగా ఉన్నాయి. ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఇతర పథకాలను అమలు చేయడానికి ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. ఈ పథకాల అమలుకు 75 వేల కోట్ల అవసరం ఎకనమికల్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. వీటికి తోడు ఇప్పటికే బీఆర్ఎస్ సర్కార్ చేసిన 5 లక్షల కోట్ల అప్పులు... లక్ష కోట్ల కాళేశ్వరం బ్యారేజీ పనులు.. ఇవన్నీ ఎలా తట్టుకుంటుంది అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 5, 2023 | 02:20 PMLast Updated on: Dec 05, 2023 | 2:20 PM

Many Challenges For The New Government Formed In Telangana

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ సర్కార్ ముందు ఎన్నో సవాళ్ళు రెడీగా ఉన్నాయి. ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఇతర పథకాలను అమలు చేయడానికి ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. ఈ పథకాల అమలుకు 75 వేల కోట్ల అవసరం ఎకనమికల్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. వీటికి తోడు ఇప్పటికే బీఆర్ఎస్ సర్కార్ చేసిన 5 లక్షల కోట్ల అప్పులు… లక్ష కోట్ల కాళేశ్వరం బ్యారేజీ పనులు.. ఇవన్నీ ఎలా తట్టుకుంటుంది అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

India’s alliance : ఇండియా కూటమికి బీటలు.. ?

తెలంగాణ ఏర్పడే నాటికి మిగులు రాష్ట్రం.. ఈ పదేళ్ళల్లో 5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మారింది. రాష్ట్ర విద్యుత్ సంస్థలు కూడా 50 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఈ సమస్యలకు తోడు… కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, ఇతర పథకాలు అమలు కావాలంటే 75 వేల కోట్లు కావాలి. ఏడాది లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్.. నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు ఇస్తామో డేట్స్ కూడా అనౌన్స్ చేసింది. దాంతో ఫిబ్రవరి 1 నాడు గ్రూప్ 1 నోటిఫికేషన్ తో కొత్త ఉద్యోగాల ప్రక్రియ మొదలుపెట్టాల్సి ఉంది. ఇప్పటికే పరీక్షలకు సిద్ధంగా ఉన్నా గ్రూప్ 2, ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్స్ కోసం చూస్తున్న గ్రూప్ 4 కింద పోస్టులను భర్తీ చేయాలి.

విద్యుత్ సంస్థల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. 50 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి. పైగా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అంటే ఏడాదికి 3 వేల 500కోట్లు సబ్సిడీ కింద డిస్కమ్ లకు ప్రభుత్వం అందించాలి. రైతులకు ఉచిత విద్యుత్, కొన్ని సామాజిక వర్గాలకు ప్రకటించిన సబ్సిడీలను కూడా కంటిన్యూ చేయడానికి మరో 10 వేల కోట్లను ప్రభుత్వం భరించాలి. రాష్ట్రమంతటా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం హామీ అమలు చేయాలి. అప్పుడు బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా ఆర్టీసీలో బస్సుల సంఖ్య పెంచకపోతే.. కర్ణాటకలో పరిస్థితులే రిపీట్ అవుతాయి. ప్రభుత్వం అభాసుపాలయ్యే అవకాశం ఉంది. ఆర్టీసీ కూడా ప్రస్తుతం నష్టాల్లోనే ఉంది. ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తామన్నది కాంగ్రెస్. దీనికితోడు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వేతన సవరణ అమలు చేయాలి.

ఆర్థికపరంగా ప్రభుత్వ ఇబ్బందులు అలా ఉంటే.. ఇవి కాకుండా వేరే సవాళ్ళు కూడా ఉన్నాయి. నాగార్జున సాగర్ డ్యామ్ పై ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ వివాదాన్ని కొత్త ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంటుంది. సోమవారం కృష్ణాబోర్డు మీటింగ్ పెట్టినా.. తెలంగాణలో ప్రభుత్వం మారడంతో ఇక్కడి ENC దానికి హాజరు కాలేదు. హైదరాబాద్ లో శాంతి భద్రతలు కాపాడటం, కొత్తగా ప్రపంచ దిగ్గజ సంస్థలను ఆహ్వానించ దగిన పరిస్థితులను కల్పించాలి. అందుకోసం గత ప్రభుత్వ విధానాలను కంటిన్యూ చేయాలి. ధరణి పోర్టల్ తీసేసి భూమాత తీసుకొస్తామంది కాంగ్రెస్. ప్రస్తుతం ధరణితో రైతులకు సంబంధించి వేలల్లో సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. వీటికితోడు పట్టాదారు పాస్ పుస్తక చట్టంలో సవరణలు చేయాలి. వీటిపై జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి.

ఇంకా పొలిటికల్ గా అతిపెద్దసవాల్ .. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకోవాలి.. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేందుకు ఉపయోగపడాలి. ఇవి నెరవేరాలంటే.. ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను రాబోయే నాలుగు నెలల్లో తప్పకుండా అమలు చేయాలి. టైమ్ తక్కువగా ఉంది. అవి అమలు కాకపోతే నెగిటివ్ ఓటింగ్ పడే ఛాన్సుంది. అసలే బీజేపీ, బీఆర్ఎస్ రెడీగా ఉన్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ఈ నాలుగు నెలలను ఇక్కడి కాంగ్రెస్ సర్కార్ ఎలా డీల్ చేస్తుంది అనేది కూడా చూడాలి.