ASSEMBLY ELECTIONS: ఎమ్మెల్యే అభ్యర్థులంతా కోటీశ్వరులే.. కీలక విషయాల బయటపెట్టిన ఈసీ..
మిజోరం రాష్ట్రంలో మాత్రం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కోటీశ్వరులే ఉన్నారు. ఇక్కడున్న 40 అసెంబ్లీ స్థానాలకు 174 మంది పోటీ పడుతున్నారు. అందులో 112 అభ్యర్థులు కోటీశ్వరులే. రూ.69 కోట్ల ఆస్థితో మిజోరం రాష్ట్ర ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) అధ్యక్షులు ఆండ్రూ లాక్రేంకిమా మొదటి స్థానంలో ఉన్నారు.
ASSEMBLY ELECTIONS: ఈ రోజుల్లో రాజకీయాలు అంటేనే ఖర్చుతో కూడుకున్న పని. బూత్ నుంచి మొదలుపెడితే నియోజకవర్గం వరకూ ప్రతీ స్థాయిలో సభలు సమావేశాలు నిర్వహించాలంటే.. వ్యవహారం కోట్లతోనే నడుస్తుంది. పైసా లేనిదే పని జరగదు. అయినా ఎమ్మెల్యే అభ్యర్థులు వెనక్కి తగ్గరు. ఎన్నికోట్లైనా ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉంటారు. అప్పు తెచ్చి మరీ ఖర్చు చేస్తుంటారు. ఎలక్షన్ అఫిడవిట్‌లో వీళ్ల అసలు ఆస్థుల వివరాలు ఉంటాయి.
కొందరు కోటీశ్వరులు ఉంటే, ఇంకొందరు మాత్రం లక్షాధికారులే ఉంటారు. ఎన్నికల్లో గెలవడమే టార్గెట్ అనుకుని, అప్పు చేసేందుకు కూడా రెడీ అవుతుంటారు. కానీ మిజోరం రాష్ట్రంలో మాత్రం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కోటీశ్వరులే ఉన్నారు. ఇక్కడున్న 40 అసెంబ్లీ స్థానాలకు 174 మంది పోటీ పడుతున్నారు. అందులో 112 అభ్యర్థులు కోటీశ్వరులే. రూ.69 కోట్ల ఆస్థితో మిజోరం రాష్ట్ర ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) అధ్యక్షులు ఆండ్రూ లాక్రేంకిమా మొదటి స్థానంలో ఉన్నారు. ఇక మిజోరం సీఎం జోరాంథంగా రూ.5 కోట్ల ఆస్తితో టాస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. మిగిలిన 112 మంది అభ్యర్థులు కూడా వాళ్ల వాళ్ల స్థాయిని బట్టి కోట్లలోనే ఆస్తుల వివరాలు అఫిడవిట్‌లో చూపించారు. తెలంగాణ కంటే ముందే వచ్చే నెలలో మిజొరంలో ఎన్నికలు జరగబోతున్నాయి.
ఈ క్రమంలో అభ్యర్థుల ఆస్తుల వివరాలను వెల్లడించింది ఎలక్షన్ కమిషన్. సాధారణంగా అభ్యర్థులు అఫిడవిట్‌లో చూపించే ఆస్తులకు, అసలు ఆస్తులకు సంబంధం ఉండదు అన్నది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి అఫిడివిట్‌లోనే కోట్ల ఆస్తులు ఉంటే.. ఇక అసలు ఆస్తులు ఎన్ని ఉంటాయో అన్న విషయం ఇప్పుడు మిజోరాంలో హాట్ టాపిక్‌గా మారింది.