MLC KAVITHA: బీసీల సీట్లు అగ్రవర్ణాలకు అమ్ముకున్న కాంగ్రెస్: ఎమ్మెల్సీ కవిత
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న 8 జనరల్ సీట్లకు గానూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు నాలుగు సీట్లు ఇచ్చింది. ఈ సారి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. బీసీల సీట్లను కోట్ల రూపాయలకు అమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ.. అగ్రవర్ణాలకు అప్పగించింది.
MLC KAVITHA: బీసీల సీట్లను కోట్లకు అమ్ముకొని అగ్రవర్ణాలకు కాంగ్రెస్ పార్టీ టికెట్లను కట్టబెట్టిందని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సీట్లు అమ్ముకొని రేవంత్ రెడ్డి పేరును రేటెంత రెడ్డిగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. కామారెడ్డిలో ఖాళీ కుర్చీలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించారని చెప్పారు. నిజామాబాద్‌లో జరిగిన గోసంగి కుల ఆత్మీయ సమ్మేళనంలో కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రసంగించారు. “సీట్లు అమ్ముకొని రేవంత్ రెడ్డి పేరును రేటెంత రెడ్డిగా మార్చుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న 8 జనరల్ సీట్లకు గానూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు నాలుగు సీట్లు ఇచ్చింది. ఈ సారి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు.
JANASENA: జనసేనకు మరో దెబ్బ.. జాతీయ జనసేన పార్టీతో ఓట్ల చీలిక..?
బీసీల సీట్లను కోట్ల రూపాయలకు అమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ.. అగ్రవర్ణాలకు అప్పగించింది. ఒక్క సీటు బీసీలకు ఇవ్వని జిల్లాకు వచ్చి బీసీ డిక్లరేషన్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. రైతు బంధును రైతులకు వేస్తున్న బిచ్చం అని రేవంత్ రెడ్డి అంటున్నారు. రేవంత్ రెడ్డి కామారెడ్డికి వచ్చి కాలుదువ్వుతున్నారు. కేసీఆర్ సీఎం కాబట్టి రకరకాల వ్యూహాల వల్ల రెండు సీట్లలో పోటీ చేస్తున్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లగా సీఎం కేసీఆర్‌ను చూసి బీజేపీ నేత ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి రెండు చోట్ల పోటీకి దిగారు. వారికి వాతలు మిగులుతాయి కానీ ఫలితం మాత్రం రాదు. కర్నాటక ప్రజలు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తుంటే.. ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య తెలంగాణకు వచ్చి బీసీలకు అవి చేస్తామని ఇవి చేస్తామని చెబుతున్నారు. సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించి మరోసారి బీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకురాలి. ఇప్పటి వరకు దక్షిణ భారత దేశంలో ఎవ్వరూ వరుసగా మూడో సారి ముఖ్యమంత్రి కాలేదు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యి రికార్డు సృష్టిస్తారు.
ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఏం అనుకుంటున్నారన్నది చాలా ప్రభుత్వాలు మరిచిపోతాయి. కానీ సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు అన్ని సమస్యలను తెలుసుకొని తక్షణమే పరిష్కరిస్తారు. ఎన్నికలు ఉన్నా లేకుండా ప్రజలు కోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ నిలుస్తుంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రూ.400 గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1200 కు చేరింది. పేద ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో మూడు డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉండేవి. ఇవాళ 104కు తీసుకుళ్లాం” అని కవిత వ్యాఖ్యానించారు.