Gandhi Bhavan : గాంధీభవన్ లో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్.. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమైనాయి..
ఎన్నికల ప్రచారంలో కేసీఆర్, కేటీఆర్, హరిష్ రావు లు ఓటమి భయం తో అబద్దాలు మాట్లాడుతున్నారు. అని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు ఆపాలని అంటున్నారని చెబుతున్నారు. ఇది ముమ్మాటికి అబద్దం అని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
గాంధీ భవన్ లో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ విజయశాంతి ప్రెస్ మీట్ నిర్వింహించారు. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్, కేటీఆర్, హరిష్ రావు లు ఓటమి భయం తో అబద్దాలు మాట్లాడుతున్నారు. అని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు ఆపాలని అంటున్నారని చెబుతున్నారు. ఇది ముమ్మాటికి అబద్దం అని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతు బంధు ఆపాలని నేను ఎక్కడ చెప్పలేదు. కాంగ్రెస్ నేతలు కూడా ఎక్కడ అనలేదు. గత నెలలో రైతు బంధు ,దళిత బంధు ,బీసీ బంధు ,రుణమాఫీ లు నామినేషన్ ప్రక్రియ కంటే ముందే విడుదల చేయాలని డిమాండ్ చేసాం. రైతుబంధు ఆపాలని కాదు..పెంచాలని చెబుతున్నాం కాంగ్రెస్ పార్టీ. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేయాలని మా మేనిఫెస్టో లో పెట్టాము. ఒకేసారి ఏక కాలంలో రుణమాఫీ చేసిన ఏకైక పార్టీ కంగ్రెస్ మాత్రమే.
ఇది కూడా చదవండి : MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు తీవ్ర అస్వస్థత.. ప్రచార వాహనం పైనే పడిపోయిన కవిత
దేశంలోనే మొదటి సారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు బీఆరెస్ 24 గంటలు ఇవ్వడం లేదు. మేను అధికారంలోకి వచ్చకా తెలంగాణ లో రైతంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. రైతు బంధు కంటే రైతు భరోసా తీసుకొచ్చి 15 వేలు రైతులకు ఇస్తాం. ఇక మోడీ ,కేసీఆర్ లు రైతులకు అన్యాయం చేశారు. రైతుల ఆదాయం మోడీ డబుల్ చేస్తా అన్నారు. రైతులకు పంట నష్టం జరిగితే పంట భీమా లేని ఏకైక రాష్ట్రము తెలంగాణ మాత్రమే అని అన్నారు. వరి కి 500 బోనస్ ఇస్తాం.. ఇప్పటికే ఈ పద్దతి ఛత్తిస్ ఘడ్ లో అమలు చేస్తున్నాం. కాళేశ్వరం లో అవినీతి వల్లే నాణ్యత లోపం ఉంది. లక్ష కోట్ల అప్పు తెచ్చి కాళేశ్వరం కడితే ఒక ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వక ముందే కూలిపోతున్నాయి. కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తరువాతే ఓట్లు అడగాలి. లక్ష రూపాయల రుణమాఫీ మీద కేసీఆర్ ఎందుకు మోసం చేశారో చెప్పాలి అని అన్నారు. తెలంగాణ లో రాబోయేది ప్రజా ప్రభుత్వం ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.