Telangana Assembly : కేసీఆర్ కాదు.. ప్రతిపక్ష నేత ఆయనే!
తెలంగాణ ఓటర్ నిర్ణయం.. రాజకీయాలను షేక్ చేస్తోంది. అద్భుతమైన మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మంత్రివర్గంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయ్. ఐతే దీనిపై కూడా దాదాపు ఓ క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్ సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున ప్రతిపక్ష నేతగా ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ ఓటర్ నిర్ణయం.. రాజకీయాలను షేక్ చేస్తోంది. అద్భుతమైన మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మంత్రివర్గంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయ్. ఐతే దీనిపై కూడా దాదాపు ఓ క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్ సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున ప్రతిపక్ష నేతగా ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. తనను ఓడిస్తే ఫామ్‌హౌస్ పోయి వ్యవసాయం చేసుకుంటానని ఎన్నికల సమయంలో పదేపదే చెప్పిన కేసీఆర్.. అసెంబ్లీకి వస్తారా.. ప్రతిపక్ష నేత హోదాలో ఉంటారా ఉండరా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. దీనికితోడు జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్ చేస్తారని.. అసెంబ్లీకి వచ్చే చాన్స్ చాలా తక్కువ అనే ప్రచారం జరుగుతోంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేస్తారనే గుసగుసలు వినిపిస్తన్నాయ్. గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్.. ప్రతిపక్ష నేతగా వ్యవహరించేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.
ఐతే ఈ బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. లేదంటే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్ష నేత హోదాను దళితుడు, సీనియర్ నేతగా పేరున్న కడియం శ్రీహరికి అప్పగించే అవకాశాలు ఉన్నాయనే గుసగుసుల కూడా వినిపిస్తున్నాయి. 2004లో టీఆర్ఎస్ఎల్పీ లీడర్‌గా విజయరామారావు వ్యవహరించారు. తర్వాత 2009లో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో.. కరీంనగర్, మహబూబ్‌నగర్ స్థానాల నుంచి కేసీఆర్ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2009లో కేటీఆర్ ఫస్ట్ టైమ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తారని, అసెంబ్లీకి వచ్చే అవకాశాలు తక్కువ అన్న ప్రచారం కూడా జరుగుతోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ పరిధిలోని మెజార్టీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. గెలిచిన ఎమ్మెల్యేలతో ఇటీవల ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో సమావేశమైన కేసీఆర్.. త్వరలోనే తెలంగాణ భవన్‌లో సమావేశం నిర్వహించి ప్రతిపక్ష నేతను ఎన్నుకుందామని చెప్పినట్లు తెలుస్తోంది.