Telangana elections : KCRకే కాదు.. మరో కీలక నేతకు వివేక్‌ అప్పు.. ఎన్ని కోట్లంటే..

రీసెంట్‌గా బీజేపీని వదిలి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ వివేక్‌ ఎన్నికల అఫిడవిట్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన అఫిడవిట్‌లో తనకు ఉన్న ఆస్తులు, అప్పులు వివరాలను మెన్షన్‌ చేశారు వివేక్‌. ఈ వివరాల్లో తాను కేసీఆర్‌కు కోటి రూపాయలు అప్పు ఇచ్చినట్టు చెప్పారాయన.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 13, 2023 | 04:24 PMLast Updated on: Nov 13, 2023 | 4:24 PM

Not Only Kcr Vivek Owes Another Key Leader How Many Crores

రీసెంట్‌గా బీజేపీని వదిలి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ వివేక్‌ ఎన్నికల అఫిడవిట్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన అఫిడవిట్‌లో తనకు ఉన్న ఆస్తులు, అప్పులు వివరాలను మెన్షన్‌ చేశారు వివేక్‌. ఈ వివరాల్లో తాను కేసీఆర్‌కు కోటి రూపాయలు అప్పు ఇచ్చినట్టు చెప్పారాయన. ఈ ఇష్యూ హాట్‌ టాపిక్‌గా మారింది. పార్టీలు వేరైనా కేసీఆర్‌కు, వివేక్‌కు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయంటూ అంతా చర్చించుకున్నారు. ఇదిలా ఉండగానే మరో నేతకు కూడా వివేక్‌ అప్పు ఇచ్చారని తెలియడం ఇప్పుడు మరో న్యూస్‌గా మారింది. కేవలం కేసీఆర్‌కే కాదు.. రీసెంట్‌గా బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి కూడా వివేక్‌ అప్పిచ్చారట. కొంత కాలం క్రితం రాజగోపాల్‌ రెడ్డికి వివేక్‌ కోటీ యాభై లక్షలు అప్పుగా ఇచ్చారట.

Etala Rajender : ఒంటరి అయిపోయిన ఈటల..!

ఈ విషయాన్ని కూడా తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు వివేక్‌. దీంతో కోమటిరెడ్డితో కూడా వివేక్‌కు ఉన్న సత్సంబందాలు హాట్‌ టాపిక్‌గా మారాయి. అయితే ఈ రెండు విషయాలను వివేక్‌ అనుచరులు తిప్పికొడుతున్నారు. వివేక్‌ బీఆర్‌ఎస్‌లో ఉన్న సమయంలో కొన్ని అవసరాల రిత్యా కేసీఆర్‌ వివేక్‌ నుంచి డబ్బు తీసుకున్నారని చెప్తున్నారు. కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కూడా బీజేపీలో ఉన్న టైంలో వివేక్‌ నుంచి డబ్బు తీసుకున్నారంటూ చెప్తున్నారు. వాటి వెనక ఎలాంటి తప్పుడు ఉద్దేశం కానీ.. తప్పుడు లావాదేవీలు కానీ లేవని చెప్తున్నారు. అన్నీ లీగల్‌గా జరిగిన విషయాలు కాబట్టే ధైర్యంగా ఎన్నికల అఫిడవిట్‌లో ప్రస్తావించారని చెప్తున్నారు. ఈ అఫిడవిట్‌ను అడ్డుపెట్టుకుని కొందరు వ్యక్తులు వివేక్‌ మీద బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. వాళ్ల ఆరోపణలు.. వీళ్ల వివరణలు ఎలా ఉన్నా.. సీఎం కేసీఆర్‌కు.. ఆర్థికంగా చాలా బలమైన నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి కూడా వివేక్‌ అప్పుడు ఇచ్చారనే వార్త ఇప్పుడు పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.