Congress government : ఇప్పుడు ఉంది అసలు ఆట.. ప్రభుత్వం ఎలా నడుపుతారో చూస్తాం..?

రేవంత్ అన్ని శాఖల మీద వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో వచ్చిన ఆరోపణలకు ఆన్సర్‌ వెతికే పనిలో ఉన్నారు. ఇక అటు ప్రభుత్వంలో కొత్త టీమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఐతే ఎన్నికల్లో ఓటమి తర్వాత.. బీఆర్ఎస్‌ నేతలు అంతా సైలెంట్‌గానే ఉన్నారు. రేవంత్‌ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు తప్పా.. మరో మాట అనలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 13, 2023 | 01:20 PMLast Updated on: Dec 13, 2023 | 1:20 PM

Now Is The Real Game Lets See How The Government Will Run

రేవంత్ అన్ని శాఖల మీద వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో వచ్చిన ఆరోపణలకు ఆన్సర్‌ వెతికే పనిలో ఉన్నారు. ఇక అటు ప్రభుత్వంలో కొత్త టీమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఐతే ఎన్నికల్లో ఓటమి తర్వాత.. బీఆర్ఎస్‌ నేతలు అంతా సైలెంట్‌గానే ఉన్నారు. రేవంత్‌ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు తప్పా.. మరో మాట అనలేదు. ఇదే సమయంలో కేసీఆర్‌ కు ఆపరేషన్ కావడంతో.. కేటీఆర్, హరీష్‌ అదే బిజీలో ఉండడంతో.. కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ నేతల మాటల మీద.. రియాక్ట్ కాలేదు ఎవరూ పెద్దగా ! ఐతే అసలు ఆట ఇప్పుడు మొదలైందా అంటే.. అవును అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎలా నడుపుతుందో ఇప్పుడు చూస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

BRS Ex Ministers ఎంపీ సీట్ల వేటలో ఓడిపోయిన తెలంగాణ.. బీఆర్ఎస్ మంత్రులు..

సాధ్యంకాని హామీలు ఇచ్చి.. జనాలను కాంగ్రెస్‌ మభ్యపెట్టిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ పద్దు మీద చర్చ జరగలేదని.. ఏటా పీఏసీ, కాగ్ రిపోర్ట్స్ ఇస్తున్నామని.. ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నామని చెప్పారు. లెక్కలు వేసుకొని హామీలు ఇస్తారా.. హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా అని ప్రశ్నించారు కేటీఆర్‌. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి ఇచ్చామని.. గవర్నర్‌ ప్రసంగంలోనూ పాత చింతకాయ పచ్చడి ప్రసంగమే చేస్తారని.. కేటీఆర్‌ విమర్శించారు. ఓ ఎమ్మెల్యే.. మా నియోజకవర్గంలో 45వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారని.. ఎలా అంటే మాత్రం ఆన్సర్ చెప్పడం లేదని సెటైర్ వేశారు కేటీఆర్. ఎలా ఇస్తారు అంటే.. ఇస్తామని అంటున్నారే తప్ప.. ఎలా అన్న దానికి సమాధానం లేదు అని అటున్నారు. చాలా హామీలు ఇచ్చారని.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్లకు బరువు తెలియాలని రియాక్ట్ అయ్యారు. అసలు ఆట ఇప్పుడు మొదలుకాబోతోందంటూ.. చిట్‌చాట్‌లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్ అవుతున్నాయి.