Telangana BJP : ఎన్నికల వేళ బీజేపీ నేత దారుణ హత్య
ఓ పక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతుండగా బీజేపీ నేత దారుణ హత్యకు గురి కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. చత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లా అధ్యక్షుడు రతన్ దూబేను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు.

On the one hand, the brutal murder of a BJP leader while the election campaign is going on in the entire state has become a sensation
ఓ పక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతుండగా బీజేపీ నేత దారుణ హత్యకు గురి కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. చత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లా అధ్యక్షుడు రతన్ దూబేను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. మారణాయుధాలతో కిరాతకంగా నరికి చంపారు. తెలంగాణతో (Telangana ) పాటు చత్తీస్‌గఢ్‌లో కూడా ఈ నెలలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారం హోరాహోరీగా చేస్తున్నాయి. ప్రచారంలో భాంగాగానే బీజేపీ నేత ( BJP leader )రతన్ దూబే తన నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ప్రచారంలో భాగంగా నిన్న కోసల్‌నార్ గ్రామానికి వెళ్లారు. అక్కడ స్థానిక నేతలతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. కానీ అప్పటికే రతన్‌ను లేపేసేందుకు మావోయిస్ట్‌లు ప్లాన్ చేశారు. ముందుగానే రెక్కీ నిర్వహించి రతన్ వచ్చే మార్గంలో కాపు కాచారు.
Nepal Earthquake : నేపాల్ లో మళ్లీ భూకంపం.. అయోధ్యలో భూప్రకంపనలు..
ప్రచారం ముగించుకుని రతన్ వస్తున్న టైంలో ఎటాక్ చేశారు. ఆయన కారుపై కాల్పులు జరిపారు. కానీ రతన్ కారు నుంచి తప్పించుకుని పారిపోయారు. కానీ మావోయిస్టులు మాత్రం రతన్‌ను వెంటాడుతూ వెళ్లారు. పరిగెడుతన్న సమయంలో కిందపడిపోయి మావోయిస్టులకు చిక్కాడు రతన్. వెంటనే గన్స్‌పడేసి వాళ్ల దగ్గర ఉన్న మారణాయుధాలతో రతన్ మీద దాడి చేశారు మావోయిస్టులు. అత్యంత కిరాతకంగా నరికి చంపారు. ఓ పక్క ఎన్నికలు జరుగుతున్న వేళ బీజేపీ నేత.. అది కూడా ఏకంగా జిల్లా అధ్యక్షుడు ఇలా మావోయిస్టుల చేతిలో హత్యకు గురికావడం ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో సంచలనంగా మారింది.