CLP : కొనసాగుతున్న సీఎల్పీ సమావేశం.. సీఎల్పీ నేత ఎంపికను అధిష్టానానికి అప్పగింత..?
తెలంగాణలో అధికారం మారింది.. బీఆర్ఎస్ నుంచి హస్తం చేతికి అధికార పగ్గాలు అందుకుంది. ఇక మిగిలున్నది.. కాంగ్రెస్ లో సీఎం ఎవరు అని.. CLP నేత ఎవరు అని కాంగ్రెస్ లో ఎవరికి మంత్రి పదవి వరస్తుంది అని.. రాష్ట్రంలో తెగ చర్చ జరుగుతుంది.

Ongoing CLP meeting..CLP leader selection handed over to the leadership..?
తెలంగాణలో అధికారం మారింది.. బీఆర్ఎస్ నుంచి హస్తం చేతికి అధికార పగ్గాలు అందుకుంది. ఇక మిగిలున్నది.. కాంగ్రెస్ లో సీఎం ఎవరు అని.. CLP నేత ఎవరు అని కాంగ్రెస్ లో ఎవరికి మంత్రి పదవి వరస్తుంది అని.. రాష్ట్రంలో తెగ చర్చ జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డకా.. మొదటి జాతీయ పార్టీ అధికార పగ్గాలు చేపట్టబోతుంది. ప్రభుత్వం కంటే ముఖ్యంగా.. కీలకమైన సీఎల్పీ సమావేశం మొదలైంది. ఇందులో సీఎల్పీ నేతను ఎన్నుకునే అవకాశాలున్నాయి. లేదంటే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించే వ్యక్తిని అంగకీకరిస్తామంటూ సీఎల్పీ సమావేశం ఏకవాక్య తీర్మానంలో తీర్మానించవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సీఎల్పీ నేత ఎంపిక అధికారాన్ని ఏకవాక్య తీర్మానంతో అధిష్టానానికి అప్పగించే సాంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది.
ఈసారి కూడా అదే సాంప్రదాయం కొనసాగవచ్చు.
తాజా సమాచారం మేరకు.. సీఎల్పీ సమావేశంలో అందరూ కలిసి ఏకవాక్య తీర్మానంతో సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగించనున్నారని సమాచారం. సీఎల్పీ సమావేశం కూడా ఏఐసీసీ నుంచి ఇప్పటికే చేరుకున్న పరిశీలకుల సమక్షంలో జరగనుంది. పరిశీలకులు ఇప్పటికే హైదరాబాద్‌లో ఉన్నందున అధిష్టానం సీల్డ్ కవర్ ద్వారా సీఎల్పీ నేత పేరు ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదు.