Telangana Elections : 2 రోజులు పవన్‌.. 3 రోజులు మోదీ.. ఆఖరి వారంలో బీజేపీ యాక్షన్‌ ప్లాన్‌..

తెలంగాణలో అన్ని పార్టీలు స్పీడ్‌ పెంచాయి. ప్రచారానికి ఇంకా వారం రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు అన్ని పార్టీల కీలక నేతలు. ఈ క్రమంలో బీజేపీ తెలంగాణలో యాక్షన్‌ ప్లాన్‌కు రెడీ అయ్యింది. రెండు రోజులు పవన్‌ కళ్యాణ్‌, మూడు రోజులు ప్రధాని మోదీ తెలంగాణలో ప్రచారం చేయబోతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. 22వ తేదీన వరంగల్‌లో జరిగిన బీజేపీ సభలో పవన్‌ పాల్గొన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 23, 2023 | 01:07 PMLast Updated on: Nov 23, 2023 | 1:07 PM

Pawan In Telangana Election Campaign For 2 Days Modi For 3 Days Bjp Action Plan In Last Week

తెలంగాణలో అన్ని పార్టీలు స్పీడ్‌ పెంచాయి. ప్రచారానికి ఇంకా వారం రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు అన్ని పార్టీల కీలక నేతలు. ఈ క్రమంలో బీజేపీ తెలంగాణలో యాక్షన్‌ ప్లాన్‌కు రెడీ అయ్యింది. రెండు రోజులు పవన్‌ కళ్యాణ్‌, మూడు రోజులు ప్రధాని మోదీ తెలంగాణలో ప్రచారం చేయబోతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. 22వ తేదీన వరంగల్‌లో జరిగిన బీజేపీ సభలో పవన్‌ పాల్గొన్నారు. వరంగల్‌ ఈస్ట్‌, వెస్ట్‌ అభ్యర్థులకు మద్దతుగా పవన్‌ ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణలో అవినీతి మీద ఆరోపణలు చేస్తూనే.. బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయాలంటూ కోరారు. ఇక 23న కొత్తగూడెం, దుబ్బాక, సూర్యాపేట జిల్లాలో పర్యటించబోతున్నారు.

KCR : నష్టం జరిగింది..ఇప్పుడేం చేయలేం..! KCRతో తేల్చిచెప్పిన ప్రశాంత్ కిషోర్

బీజేపీ అభ్యర్థుల నియోజకవర్గాలతో పాటు.. జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కూడా పవన్‌ పర్యటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రధాని మోదీ కూడా ఈ నెల 25 నుంచి ప్రచారంలో జాయిన్‌ కాబోతున్నారు. నవంబర్‌ 25న తెలంగాణకు రాన్న ప్రధాని.. 25, 26, 27 తేదీల్లో తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఈ మూడు రోజుల్లో రాష్ట్రం బీజేపీ నిర్వహించే బహిరంగ సభల్లో మోదీ పాల్గొంటారు. ఇక బీజేపీ జాతీయ నేతలు.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సభల్లో పాల్గొనబోతున్నారు. ఇది ఆఖరి వారం కావడంతో తన సైన్యం మొత్తాన్ని తెలంగాణలో దింపే ప్లాన్‌లో ఉంది బీజేపీ. దీనికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్‌ కూడా ఫైనల్‌ అయ్యింది. ఇప్పటికే పవన్‌ రాకతో బీజేపీ శ్రేణుల్లో జోష్‌ పెరిగింది. ఇక ప్రధాని కూడా తెలంగాణకు రావడం.. మూడు రోజుల పాటు ఇక్కడే ప్రచారంలో పాల్గొననుండటంతో బీజేపీ కార్యకర్తలు, నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.