Manda Krishna Madiga: కంటతడి పెట్టిన మంద కృష్ణ.. సముదాయించిన ప్రధాని మోడీ
మందకృష్ణను ప్రధాని మోడీ ఆలింగనం చేసుకున్నారు. ఆయన భుజం తట్టారు ప్రధాని నరేంద్ర మోడీ. దాంతో మందకృష్ట మాదిగ భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. మోడీ మందకృష్ణ వీపుపై తడుతూ ఓదార్చారు. సభలో మంద కృష్ణమాదిగ భావోద్వేగ ప్రసంగం చేశారు.

Manda Krishna Madiga: సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో మాదిగల విశ్వరూప మహాసభలో MRPS అధినేత మంద కృష్ణ మాదిగ భావోద్వేగానికి గురయ్యారు. మందకృష్ణను ప్రధాని మోడీ ఆలింగనం చేసుకున్నారు. ఆయన భుజం తట్టారు ప్రధాని నరేంద్ర మోడీ. దాంతో మందకృష్ట మాదిగ భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. మోడీ మందకృష్ణ వీపుపై తడుతూ ఓదార్చారు. సభలో మంద కృష్ణమాదిగ భావోద్వేగ ప్రసంగం చేశారు.
CM KCR: గజ్వేల్‌లో భారీగా నామినేషన్లు.. కేసీఆర్‌ను ఓడిస్తామంటున్న బాధితులు
తమ మాదిగలను సమాజం మనుషులుగా చూడలేదని, పశువుల కంటే హీనంగా చూసిందని, తమకు ధైర్యం చెప్పడానికి వచ్చిన పెద్ద అన్న ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు మంద కృష్ణ. ప్రధాని పదవిలో ఉన్న పెద్ద వ్యక్తి తమ సభకు వస్తాడని ఊహించలేదన్నారు. సామాజిక న్యాయంపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మాటలు మాత్రమే చెప్పాయని, కానీ తమ ఆకాంక్షలు నెరవేర్చేది బీజేపీనే అన్నారు. తెలంగాణకు బీసీని సీఎంగా చేస్తామని చెప్పింది ఒక్క బీజేపీయే అని మందకృష్ణ గుర్తు చేశారు. ఈ విశ్వరూప మహాసభకు తెలుగు రాష్ట్రాల నుంచి MRPS కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.