Assembly Elections: ఈసీ సంచలన నిర్ణయం.. ఎన్నికల షెడ్యూల్‌లో మార్పు..
నిజానికి రాజస్థాన్‌లో నవంబర్ 23న ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఈ తేదీని 25కు పోస్ట్‌ఫోన్ చేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 23న రాష్ట్రంలో పెద్దమొత్తంలో పెళ్లిళ్లు ఉన్న కారణంగా తేదీని మార్చుతున్నట్టు ప్రకటించింది.
Assembly Elections: తెలంగాణతో పాటు నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ రెడీ అయ్యింది. మధ్యప్రదేశ్, ఛతీస్‌గఢ్, మిజోరం, రాజస్థాన్ స్థానాలకు కూడా నవంబర్‌లోనే ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. కానీ ఇప్పుడు రాజస్థాన్ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది ఈసీ. నిజానికి రాజస్థాన్‌లో నవంబర్ 23న ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఈ తేదీని 25కు పోస్ట్‌ఫోన్ చేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
నవంబర్ 23న రాష్ట్రంలో పెద్దమొత్తంలో పెళ్లిళ్లు ఉన్న కారణంగా తేదీని మార్చుతున్నట్టు ప్రకటించింది. దీంతో రాజస్థాన్‌లో 23న జరగాల్సిన ఎలక్షన్ 25న జరగబోతోంది. అయితే కౌంటింగ్, రిజల్ట్ మాత్రం ముందు చెప్పిన తేదీల్లోనే ఉంటాయని చెప్పింది. ఇక మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో యథాతథంగా ఎన్నికలు జరగబోతున్నాయి. మధ్యప్రదేశ్‌లో అక్టోబర్ 21న ఎన్నిల నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. నవంబర్ 17న పోలింగ్, డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు ఇవ్వబోతోంది. మిజోరంలో అక్టోబర్ 13న ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది. నవంబర్ 7న పోలింగ్ నిర్వహించి.. డిసెంబర్ 3న రిజల్ట్ చెప్పబోతున్నారు. ఇక చత్తీస్‌గఢ్‌లో ఈ సారి రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అక్టోబర్ 13న మొదటి ఫేజ్‌కు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది.
అక్టోబర్ 21 సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. ఇక నవంబర్ 7న మొదటి దశ పోలింగ్, నవంబర్ 17న రెండో దశ పోలింగ్ నిర్వహించబోతున్నారు. డిసెంబర్ 3న కామన్‌గా రెండు ఫేజ్‌లకు సంబంధించిన ఫలితాలు విడుదల చేస్తారు. ఈ ఐదు రాష్ట్రాల్లో తెలంగాణకు ఆఖరిగా ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణలో నవంబర్ 3న ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. నవంబర్ 30న పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబర్ 3న మిగిలిన నాలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికల ఫలితాలు చెప్తారు. ఈ వివరాలన్నీ ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. కానీ స్థానిక సమస్యల కారణంగా రాజస్థాన్‌లో పోలింగ్ తేదీని మార్చింది.