Ramulamma, Vijayashanti : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాములమ్మకు కీలక బాధ్యతలు..!

తెలంగాణ ఉద్యమ (Telangana movement) నేత, సినీ నటి మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanti) బీజేపీ (BJP) నుంచి కాంగ్రెస్ లోకి చేరిన సంగతి తెలతిసిందే.. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియడంతో కాంగ్రెస్ లో చేరిన తర్వాత టీ కాంగ్రెస్ లో సముచిత స్తానాన్ని కేటాయించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 18, 2023 | 10:53 AMLast Updated on: Nov 18, 2023 | 10:53 AM

Ramulamma Has Key Responsibilities In The Telangana Congress Party

తెలంగాణ ఉద్యమ (Telangana movement) నేత, సినీ నటి మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanti) బీజేపీ (BJP) నుంచి కాంగ్రెస్ లోకి చేరిన సంగతి తెలతిసిందే.. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియడంతో కాంగ్రెస్ లో చేరిన తర్వాత టీ కాంగ్రెస్ లో సముచిత స్తానాన్ని కేటాయించింది. ఇందుకు గానూ తెలంగాణ ఎన్నికల కోసం ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీని కాంగ్రెస్ నియమించింది. ఈ కమిటీలో మొత్తం 15 మందికి కన్వీనర్ పోస్టులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. విజయశాంతిని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చీఫ్ కోఆర్డినేటర్, ప్లానింగ్ కమిటీ కన్వీనర్ గా నియమించారు. ఇక మహేశ్వరం ఎమ్మెల్యే టికెట్ ఆశించిన పారిజాతకు కన్వీనర్ పోస్ట్ ఇచ్చింది కాంగ్రెస్. ఈ కమీటీలో ఉన్న కన్వీనర్ జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ.

ఇది కూడా చదవండి Amit Shah Tour : నేడు తెలంగాణలో అమిత్ షా పర్యటన.. ఒకే రోజు 3 సభలు.. బీజేపీ మేనిఫెస్టో విడుదల..!

ఇవాళ గాంధీ భవన్ లో మధ్యాహ్నం 12 గంటలకు సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి టీపీసీసీ (TPCC) మీడియా కమిటీ ఛైర్మన్ కుసుమ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు టీపీసీసీ వికలాంగుల విభాగం చైర్మన్ వీరయ్య ఆధ్వర్యంలో ప్రచార వాహనం ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు టీపీసీసీ దళిత కాంగ్రెస్ చైర్మన్ ప్రీతం, ఏఐసీసీ మీడియా కమిటీ చైర్మన్ అజయ్ కుమార్ ప్రెస్ మీట్ ఏర్పాటు.. మధ్యాహ్నం 1.30 కాంగ్రెస్ నాయకులు పి. వినయ్ కుమార్, కుసుమ కుమార్, కోదండ రెడ్డి ఇక.. మద్యాహ్నం 3 గంటలకు మేనిఫెస్టో కమిటీ సభ్యుల ప్రెస్ మీట్ ఉంటుందని పార్టీ శ్రేణులు వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ జాబితా..

కన్వీనర్లుగా సమరసింహారెడ్డి, రమేష్ ముదిరాజ్, పారిజాత రెడ్డి, పుష్పలీల, మల్లురవి, కోదండరెడ్డి, సిద్దేశ్వర్ అలీబిన్ ఇబ్రహీం మస్కతి, వేం నరేందర్ రెడ్డి, దీపక్ జాన్, ఒబెదుల్ల కొత్వాల్, రామ్మూర్తి నాయక్, తదితరులు ఉన్నారు.