TELANGANA ASSEMBLY ELECTIONS: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి పోటీ..? కామారెడ్డి నుంచి పోటీకి రెడీ అవుతున్న రేవంత్..!
తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ మీద పోటీకి దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకుంటే తాను కామారెడ్డి నుంచి కూడా పోటీ చేసేందుకు రెడీగా ఉన్నట్టు టాక్ నడుస్తోంది. ఇదే విషయంలో కాంగ్రెస్ హైకమాండ్‌ను ఒప్పించే పనిలో ఉన్నారట.
TELANGANA ASSEMBLY ELECTIONS: ఎన్నికలు సమీపిస్తన్నకొద్దీ పార్టీల మధ్య పోరు నువ్వా.. నేనా అన్నట్టుగా మారుతోంది. ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ.. రెండు పార్టీలు కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకు అనుగుణంగానే కాయిన్స్ మూవ్ చేస్తున్నారు రెండు పార్టీల ముఖ్య నాయకులు. తన సిట్టింగ్ స్థానం గజ్వేల్ నుంచే కాకుండా కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తానని కేసీఆర్ ఇప్పటికే చెప్పారు.
కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే తాను కూడా అక్కడే పోటీ చేస్తానంటూ బీజేపీ నేత ఈటెల రాజేందర్ కూడా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను సిట్టింగ్ స్థానంలో ఓడించి తీరుతానంటూ చాలెంజ్ చేశారు. రీసెంట్‌గా బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తన సిట్టింగ్ స్థానం మునుగోడుతో పాటు సిద్ధిపేట్ నుంచి పోటీ చేస్తానంటూ ప్రకటించారు. ఈ రెండు టికెట్లు కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ మీద పోటీకి దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకుంటే తాను కామారెడ్డి నుంచి కూడా పోటీ చేసేందుకు రెడీగా ఉన్నట్టు టాక్ నడుస్తోంది. ఇదే విషయంలో కాంగ్రెస్ హైకమాండ్‌ను ఒప్పించే పనిలో ఉన్నారట రేవంత్ రెడ్డి. దీనికోసం ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారట. ఇదంతా చూస్తుంటే.. అధికారంలోకి రావడం కంటే కేసీఆర్‌ను ఓడించటమే ప్రతిపక్షాల మెయిన్ ఎజెండా అన్నట్టు అనిపిస్తోంది.
నిజంగా ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలి అంటే అన్ని నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలను నిలబెట్టి అధికారం చేజిక్కించుకోవాలి. అది కాకుండా కేసీఆర్‌కు పోటీగా నిలబడి ప్రూవ్ చేసుకుంటే అధికారం రాదు. కాంగ్రెస్, బీజేపీల చర్యలపై రాజకీయ విశ్లేషకులు అంటున్న మాటలివి. ఒకే వ్యక్తి రెండు మూడు స్థానాల నుంచి కాకుండా.. స్థానికంగా పార్టీకోసం పని చేసినవాళ్లకు టికెట్లు ఇస్తే కొత్త వాళ్లు ప్రూవ్ చేసుకునే చాన్స్ ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు.