Telangana Sarkar : మందు బాబులకు రేవంత్‌ సర్కార్‌ చేదు వార్త..!

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌ రెడ్డి.. తన మార్క్ పాలన ఏంటో చూపిస్తున్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో ఉన్నారు. అన్ని రకాలుగా ఆలోచించి.. ఒక్కో హామీని అమలు చేస్తున్నారు. ఐతే ఇప్పుడు మందుబాబులకు రేవంత్ సర్కార్‌ బ్యాడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం స్తుతం మద్యం దుకాణాలు రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుండగా.. ఈ సమయాన్ని తగ్గించే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 13, 2023 | 12:59 PMLast Updated on: Dec 13, 2023 | 12:59 PM

Revanth Sarkars Bad News For Drug Addicts

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌ రెడ్డి.. తన మార్క్ పాలన ఏంటో చూపిస్తున్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో ఉన్నారు. అన్ని రకాలుగా ఆలోచించి.. ఒక్కో హామీని అమలు చేస్తున్నారు. ఐతే ఇప్పుడు మందుబాబులకు రేవంత్ సర్కార్‌ బ్యాడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం స్తుతం మద్యం దుకాణాలు రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుండగా.. ఈ సమయాన్ని తగ్గించే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అటు బెల్ట్ షాప్‌ల మీద కూడా రేవంత్‌ సర్కార్‌ దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని బెల్ట్ షాపులను క్లోజ్ చేయించేందుకు కాంగ్రెస్ సర్కార్‌ కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు గ్రౌండ్ వర్క్ కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపులన్నింటినీ మూయించేస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు.

ఇదే విషయాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టారు. దీంతో.. ఇచ్చిన మాట ప్రకారం బెల్ట్ షాపులను మూయించే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. తెలంగాణలో మొత్తం 2 వేల 620 మద్యం దుకాణాలు ఉండగా.. వాటికి అనుబంధంగా గ్రామాల్లో లక్షకు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఐతే మద్యం దుకాణాల్లో పరిమిత సమయం లిక్కర్ అమ్ముతుండగా.. బెల్ట్ షాపుల్లో మాత్రం 24 గంటల పాటు లిక్కర్‌ అమ్ముతున్నారు. ఈ బెల్ట్ షాపుల కారణంగా గ్రామాల్లోని యువత మద్యానికి బానిసలవుతున్నారని భావిస్తోన్న రేవంత్ సర్కార్.. వాటిని నిర్మూలించే దిశగా కసరత్తు చేస్తోంది. ఇక అటు వైన్ షాపుల సమయం కూడా తగ్గిస్తారనే ప్రచారం జరుగుతుండడంతో.. సోషల్‌ మీడియాలో మీమ్స్‌ పేలుతున్నాయి. సమయం ఉండదు మిత్రమా.. పరిగెత్తాల్సిందే అంటూ కామెడీగా కొత్త చర్చ మొదలుపెట్టారు. ఐతే అటు రేవంత్ సర్కార్ నిర్ణయంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.