కేసీఆర్ ని బతికించిన సీమాంధ్రులు..

తెలంగాణ వాళ్లు కేసీఆర్ ఓడిస్తే.. సీమాంధ్రులు బతికించారు. తెలంగాణ ఉద్యమం నడిచినంత కాలం.. KCR ఆంధ్ర వాళ్ళని అమ్మ నా బూతులు తిట్టేవారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 3, 2023 | 04:49 PMLast Updated on: Dec 03, 2023 | 4:49 PM

Seemandhras Who Survived Kcr In Telangana 2

తెలంగాణ వాళ్లు కేసీఆర్ ఓడిస్తే.. సీమాంధ్రులు బతికించారు. తెలంగాణ ఉద్యమం నడిచినంత కాలం.. KCR ఆంధ్ర వాళ్ళని అమ్మ నా బూతులు తిట్టేవారు. పరమ నీచంగా మాట్లాడేవారు. ఆంధ్ర వాళ్ళ ఆహారపు అలవాట్లు.. వాళ్ళ మాటలను కించపరుస్తూ మాట్లాడేవాడు. చిత్రమైన విషయం ఏంటంటే.. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఉంటున్న అదే సీమాంధ్రులు బీఆర్ఎస్ కు అండగా నిలబడ్డారు. ఈ ఎన్నికల్లో కూడా అదే మరోసారి రుజువైంది.

కేసీఆర్ ఉద్యమం లేవనెత్తిందే ఆంధ్రవాళ్ళకి వ్యతిరేకంగా. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర నాయకులను తిడితే ఓకే. ఈ ప్రాంతానికి అన్యాయం చేసింది లీడర్లే గానీ.. సామాన్య జనం మాత్రం కాదు. కానీ ఉద్యమ సమయంలో ఆంధ్ర ప్రజలను తిడితేనే తనకు పాపులారిటీ వస్తుందని అనుకున్నారు కేసీఆర్. అంతే ఆంధ్ర వాళ్ళు బిర్యానీ దగ్గర నుంచి ప్రతి మాటా.. ప్రతి అంశాన్ని అవహేళన చేస్తూ మాట్లాడేవారు. కానీ 2018 ఎన్నికల ముందు నుంచీ కేసీఆర్ స్వరం కాస్త మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పాతబస్తీ తప్ప మిగిలిన అన్ని నియోజవర్గాల్లో సీమాంధ్రులు బలంగా ఉన్నారన్న సంగతి అర్థమైంది. అందుకే అప్పటి నుంచి సీమాంధ్రులకు అనుకూలంగా మాట్లాడటం మొదలు పెట్టారు. అంతకుముందు అక్రమనిర్మాణాల పేరుతో కూల్చివేతలు చేపట్టినా.. తర్వాత ఆ పనులన్నీ ఆపేశారు.

రాష్ట్రం విడిపోయాక తాము నివసించడానికి గ్రేటర్ హైదరాబాద్ లో ఇబ్బందులు ఉంటాయని మొదట భయపడ్డ సీమాంధ్రులు.. అలాంటి సమస్యలేవీ రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అందుకే బీఆర్ఎస్ ను సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. GHMC ఎన్నికలతో పాటు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ కారు గుర్తుకే ఓట్లేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా అంతే.. రాష్ట్రమంతటా తెలంగాణ వాళ్ళు బీఆర్ఎస్ ను ఓడిస్తే.. గ్రేటర్ లో మాత్రం గులాబీ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. అందుక్కారణం సీమాంధ్రుల ఓట్లే.

ఈ ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో సీమాంధ్రుల ప్రభావం ఉన్నచోట బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, జూబ్లీ హిల్స్, సనత్ నగర్, సికింద్రాబాద్, మేడ్చల్ లాంటి నియోజకవర్గాల్లో సీమాంధ్రులు కారు పార్టీని గెలిపించారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోనూ బీఆర్ఎస్ ఓడిపోయింది. కానీ సిటీ జనం మాత్రం కంటికి కనిపిస్తున్న అభివృద్ధికి ఓట్లేశారు. తెలంగాణ పల్లెల్లో కేసీఆర్ అహంకారాన్ని నిరసిస్తూ ఎమోషనల్ గా కాంగ్రెస్ ను గెలిపించారు జనం. కానీ కేసీఆర్ ఎవరినైతే తిడుతూ వచ్చారో.. వాళ్లే.. ఆ సీమాంధ్రులే.. ఆ మాత్రం సీట్లయినా కారు పార్టీకి ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో ఈ సీట్లు రాకపోతే బీఆర్ఎస్ కు మిగిలిన చోట్ల కలిపి 20 స్థానాలకు మించి వచ్చేవి కావు. సీమాంధ్రుల ఓట్లు ఎంత అవసరమో ఇప్పుడు కేసీఆర్ కు బాగా తెలిసొచ్చినట్టుంది.