YS Sharmila : ఆటలో అరటిపండులా షర్మిల.. పోటీకి తప్పుకోవడం వెనక ఇంత ప్లాన్ ఉందా..?
షర్మిల చెప్పిన మాటలు అన్నీ ఇన్నీ కావు. రాజన్న రాజ్యం తెస్తాం.. తెలంగాణ గతి మారుస్తాం అంటూ షర్మిల చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తాను తెలంగాణ బిడ్డనేనని.. ఈ బిడ్డను గెలిపించండి అంటూ చాలా సెంటిమెంట్ డైలాగులు వదిలారు షర్మిల. ఐతే జనాలు మాత్రం అలా చూడలేక పోయారు. తెలంగాణ ఆడపడుచుల ఫీల్ అవ్వలేకపోయారు. అందుకే వేలకు వేల కిలోమీటర్లు నడిచినా.. దూకుడు చూపించినా.. జనాలు పెద్దగా పట్టించుకోలేదు.

Sharmila is a banana in the game Is there such a plan behind leaving the competition
షర్మిల ( YS Sharmila ) చెప్పిన మాటలు అన్నీ ఇన్నీ కావు. రాజన్న రాజ్యం తెస్తాం.. తెలంగాణ గతి మారుస్తాం అంటూ షర్మిల చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తాను తెలంగాణ బిడ్డనేనని.. ఈ బిడ్డను గెలిపించండి అంటూ చాలా సెంటిమెంట్ డైలాగులు వదిలారు షర్మిల. ఐతే జనాలు మాత్రం అలా చూడలేక పోయారు. తెలంగాణ ఆడపడుచుల ఫీల్ అవ్వలేకపోయారు. అందుకే వేలకు వేల కిలోమీటర్లు నడిచినా.. దూకుడు చూపించినా.. జనాలు పెద్దగా పట్టించుకోలేదు. రాజకీయ పార్టీలు కూడా అంతే.. షర్మిల పార్టీ గురించి మాట్లాడడానికి కూడా ముందుకు రాలేదు అంటే అర్థం చేసుకోవచ్చు. దీంతో ఇక లాభం లేదు అనుకున్న షర్మిల.. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు ప్రయత్నించారు.
JANASENA: వెనక్కి తగ్గిన పవన్..? తెలంగాణలో జనసేన పోటీ కష్టమే..!
( Telangana elections ) ఐతే అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఢిల్లీ వెళ్లి సోనియాను కలిసినా.. ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా సొంతంగా పోటీ చేయాలని భావించారు. అభ్యర్థులు దొరకలేదు.. లేదంటే ధైర్యం చాలలేదో కానీ.. ఉన్నట్లుండి అస్త్ర సన్యాసం చేశారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీకే మద్దతు ప్రకటించారు. ఓట్లు చీలి పోనివ్వకూడదనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రకటించారు. వైటీపీ ( YTP )ని కాంగ్రెస్‌లో విలీనం చేయకుండానే.. నేరుగా షర్మిల మద్దతు ప్రకటించడం హైలైట్. దీంతొ తెర వెనక ఏం జరిగి ఉంటుందన్న అనుమానం కలుగుతోంది. షర్మిలను ఏపీ రాజకీయాల కోసం వినియోగించుకుంటారు అని టాక్ నడుస్తోంది. సీఎం జగన్ ( CM Jagan ) పైనే ఆమె సోదరిని ప్రయోగిస్తారనే ప్రచారం కూడా మొదలైంది. ఇప్పటికే టీడీపీ పార్టీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. ఇప్పుడు షర్మిల కూడా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించి పోటీ నుంచి తప్పుకుంది. ఐతే ఇదంతా కాంగ్రెస్‌కు సానుకూల ఫలితం చూపిస్తుందన్న టాక్ మొదలైంది. ఐతే షర్మిల రాజకీయ భవిష్యత్తుపై గట్టి హామీ తీసుకునే ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.