ASSEMBLY ELECTIONS: సెంటిమెంట్ పాలిటిక్స్.. కారును వెంటాడుతున్న శ్రీకాంతాచారి త్యాగం..?
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతచారి నవంబర్ 29న ఒంటిపై కిరోస్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ డిసెంబర్ 3న చనిపోయాడు. కో-ఇన్సిడెంటల్‌గా ఈ రెండు డేట్స్ తెలంగాణ ఎన్నికలకు మ్యాచ్ అయ్యాయి.
ASSEMBLY ELECTIONS: తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గతేడాదితో కంపేర్ చేసుకుంటే తక్కువ స్థాయిలో ఓట్లు పోలైనప్పటికీ.. ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రస్తుతం వస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పడం బిలియన్ డాలర్ క్వశ్చన్‌గా మారింది. అన్ని సర్వేలను ఓవరాల్‌గా పరిశీలిస్తే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఒక్కడే బీఆర్‌ఎస్ పార్టీని ఓ టెన్షన్ వెంటాడుతోంది.
KCR: కామారెడ్డిలో కేసీఆర్‌కు ఓటమి తప్పదా.. ఎగ్జిట్ పోల్ ఫలితం ఇదే..!
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతచారి నవంబర్ 29న ఒంటిపై కిరోస్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ డిసెంబర్ 3న చనిపోయాడు. కో-ఇన్సిడెంటల్‌గా ఈ రెండు డేట్స్ తెలంగాణ ఎన్నికలకు మ్యాచ్ అయ్యాయి. శ్రీకాంత చారి ఆత్మహత్యాయత్నం చేసిన నవంబర్ 29 మరుసటి రోజే తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. శ్రీకాంతచారి చనిపోయిన డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఆయన ఎలా చనిపోయారో బీఆర్ఎస్ పార్టీ కూడా అలాగే తెలంగాణలో అధికారం కోల్పోబోతోందని.. ప్రత్యర్థి వర్గాలు ఆరోపిస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తరువాత అమరవీరుల కుటుంబాలను బీఆర్‌ఎస్ పార్టీ పట్టించుకోలేదు అనేది ప్రత్యర్థులు ఎప్పటి నుంచో చేస్తున్న ప్రధాన ఆరోపణ.
ఇప్పుడు శ్రీకాంతచారి ఆత్మహత్య చేసుకున్న, చనిపోయిన డేట్లు కూడా ఎన్నికలు మ్యాచ్ అవడంతో దీన్నే ఆయుధంగా చేసుకున్నారు ప్రత్యర్థులు. అమరవీరుల పాపం బీఆర్ఎస్ పార్టీకి తలుగుతుందని.. అదే ఆ పార్టీని అధికారం నుంచి దించబోతోందని చెప్తున్నారు. డిసెంబర్ 3 తరువాత తెలంగాణలో కొత్త ప్రభుత్వం రాబోతోందని చెప్తున్నారు. మరి నిజంగానే బీఆర్‌ఎస్‌ను అమరవీరుల శాపం వెంటాడుతోందా లేదా చూడాలంటే డిసెంబర్ 3 వరకూ ఆగాల్సిందే.