Telangana assembly : నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

ఇవాళ తెలంగాణ రాష్ట్ర కొత్త అసెంబ్లీ కొలువుదీరనుంది. నూతనంగా ఎన్నికైన 119 ఎమ్మెల్యేలు సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా అసెంబ్లీ కొత్త స్పీకర్ ఎన్నిక నేడు ఉంటుందా లేదా అనేది నేడు అప్డేట్ రానుంది. మరో వైపు ఎంఐంఎంకు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్ గా ఉండనున్నారు. ఈ సారి అసెంబ్లీకి కొత్తగా 51 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 9, 2023 | 09:41 AMLast Updated on: Dec 09, 2023 | 10:08 AM

Telangana Assembly Meetings From Today

ఇవాళ తెలంగాణ రాష్ట్ర కొత్త అసెంబ్లీ కొలువుదీరనుంది. నూతనంగా ఎన్నికైన 119 ఎమ్మెల్యేలు సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా అసెంబ్లీ కొత్త స్పీకర్ ఎన్నిక నేడు ఉంటుందా లేదా అనేది నేడు అప్డేట్ రానుంది. మరో వైపు ఎంఐంఎంకు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్ గా ఉండనున్నారు. ఈ సారి అసెంబ్లీకి కొత్తగా 51 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

తెలంగాణ మూడో శాసనసభలో మొదటి అసెంబ్లీ సమావేశం నేటి ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసి ఎన్నికయ్యారు. కాగా కొత్త ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గా ఎన్నికైన ప్రతీ ఎమ్మెల్యే గెలిచిన పత్రం రెండు కాపీలజిరాక్స్, రెండు ఫోటోలు తేవాలని అసెంబ్లీ సెక్రెటరీ ఆదేశాలు జారీ చేశారు. కాగా అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఎన్నిక వల్ల రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు.

ఈ అసెంబ్ల సమావేశాలు ఎన్ని రోజులు ఉంటాయనేది ఇంకా స్పష్టమైన క్లారిటీ లేదు.. తొలి రోజు చర్చలేవీ ఉండవు కాబట్టి.. మరో 3 రోజులు ఉండొచ్చనే అంచనా ఉంది.
అసెంబ్లీ అధికారుల సమాచారం మేరకు.. ఈ నెల 13 నుంచి అసెంబ్లీ సమావేశాలు తిరిగి మొదలయ్యే అవకాశం ఉంది. ఆ మరుసటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. తెలంగాణ మూడో అసెంబ్లీ శాసన సభ స్పీకర్ గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ ను కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఖరారు చేసింది. ఈ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత సభ్యులు ఆయన్ను స్పీకర్ గా ఎన్నుకునే ఛాన్స్ ఉంది.