BRS manifesto : బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల.. గెలుపు లక్ష్యంగా నూతన పథకాలు..
తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ మేనిఫెస్టోని ప్రకటించారు. ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉన్న పథకాలను మరింత పెంచుతూ మరో రెండు నూతన పథకాలు ప్రవేశ పెట్టారు సీఎం కేసీఆర్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే ఐదేండ్లలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి బీఆర్‌ఎస్ ఏం చేయబోతున్నదన్న పూర్తి ప్రణాళికను వివరించనున్నారు. 'ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చేలా మేనిఫెస్టో తయారు చేశాము'

Telangana Chief Minister BRS chief KCR announced the BRS manifesto at Telangana Bhavan in Hyderabad
తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ మేనిఫెస్టోని ప్రకటించారు. ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉన్న పథకాలను మరింత పెంచుతూ మరో రెండు నూతన పథకాలు ప్రవేశ పెట్టారు సీఎం కేసీఆర్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే ఐదేండ్లలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి బీఆర్‌ఎస్ ఏం చేయబోతున్నదన్న పూర్తి ప్రణాళికను వివరించనున్నారు. ‘ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చేలా మేనిఫెస్టో తయారు చేశాము’
బీఆర్ఎస్ 2023 నూతన మేనిఫెస్టో విడుదల..
- హైదరాబాద్‌లో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు
- అగ్రవర్ణ పేదలకు 119 గురుకులాలు
- రైతుబంధు, దళితబంధును కొనసాగిస్తాం.
- రైతుబంధును రూ.16 వేలు చేస్తాం.
- ఏడాదికి రూ.500 చొప్పున దశలవారీగా పెన్షన్.. పెంపు మొత్తం రూ.5000లకు పెంపు.
- అర్హులైన మహిళలకు నెలకు రూ.1000 భృతి..
- తెల్ల రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ..
- పేద మహిళలకు 400కే గ్యాస్ సిలిండర్..
- దివ్యాంగుల పెన్షన్లు రూ.6 వేలకు పెంపు..
- పేద మహిళలకు రూ.3వేల గౌరవ భృతి..
- కేసీఆర్ బీమా ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుంది.
- గిరిజనులకు పోడు పట్టాల కార్యక్రమం కొనసాగుతుంది.
- గిరిజనులకు మరిన్ని సంక్షేమ పథకాలు తెస్తాం.
- ఆరోగ్య శ్రీ 15 లక్షలకు పెంపు..
- తండాలు, గోండుగూడెలను పంచాయతీలుగా చేస్తాం.
- బీసీలకు అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తాం.
- తెల్లరేషన్ కార్డుదారులకు రూ.5 లక్షల కేసీఆర్ బీమా.
- అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు రూ.400లకే గ్యాస్ సిలిండర్.
- ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్‌పై భరోసా..
- అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తివేత..
నూతన పథకం..
- అనాథలైన పిల్లల కోసం ప్రత్యేక పాలసీ..
- తెలంగాణ అన్నపూర్ణ పథకం : కింద ప్రతి రేషన్ కార్డు హోల్డర్‌కు సన్నబియ్యం..
- కేసీఆర్ భీమా ప్రతి ఇంటికి ధీమా పథకం : పేదలకు కేసీఆర్ భీమా
S.SURESH