CM Revanth Reddy : మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి వెంట మంత్రి మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ ఉన్నారు. ముందుగా మొదటి సారి సీఎం హోదాలో యశోద ఆసుపత్రికి వచ్చిన రేవంత్ రెడ్డి ఆసుపత్రి యాజమన్యం స్వాగతం పలికింది. అనంతరం కేసీఆర్ వద్దకు మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్ చేతిలో చేయి వేసి ఓనికి వెళ్లారు. కేటీఆర్ తో కలిసి కేసీఆర్ ను పరామర్శించించారు.

Telangana CM Revanth Reddy visited former CM KCR
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి వెంట మంత్రి మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ ఉన్నారు. ముందుగా మొదటి సారి సీఎం హోదాలో యశోద ఆసుపత్రికి వచ్చిన రేవంత్ రెడ్డి ఆసుపత్రి యాజమన్యం స్వాగతం పలికింది. అనంతరం కేసీఆర్ వద్దకు మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్ చేతిలో చేయి వేసి ఓనికి వెళ్లారు. కేటీఆర్ తో కలిసి కేసీఆర్ ను పరామర్శించించారు. అనంతరం, యశోద ఆసుపత్రి వద్ద రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. “తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పరామర్శించాను. ఆయన కోలుకుటున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలి, సమస్యలపై కేసీఆర్ మాట్లాడాలి. ప్రతిపక్షంలో ఉండాలి. ఆయన ముఖ్యమంత్రి అనుభవాలు మా ప్రభుత్వానికి అవసర ఉన్నాయి. ” అని కామెంట్స్ చేశారు.
TPCC Chief : పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ని మారుస్తారా..?
ఇక గురువారం 8వ తేదిన అర్దరాత్రి దాటిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రం ఎర్రవల్లి గ్రామం ఫామ్ హౌస్ లో జారిపడ్డారు. దీంతో ఆయన హాటా హాటినా హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఆరోగ్యంపై పరిక్షలు చేయగా ఆయన ఎడమ కాలు తుంటికి గాయమైంది అని వైద్యులు నిర్ధారించారు. కేసీఆర్‌కు యశోద ఆసుపత్రి వైద్యులు హిప్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ చేశారు. కాగా, ఆపరేషన్ అనంతరం కేసీఆర్ కోలుకుంటున్నారు. వాకర్ సాయంతో కేసీఆర్‌ను వైద్యులు నడిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.