Telangana Congress: కాంగ్రెస్‌కు బైబై చెప్పబోయేది వీళ్లే.. కీలక నేతలు కూడా..!
టికెట్ కచ్చితంగా వస్తుందని ఊహించిన కొందరు నేతలకు భారీ షాక్ తగిలింది. దీంతో టిక్కెట్ దక్కని నేతలు ఎవరికి వారు తమ దారి చూసుకుంటున్నారు. తమకు టికెట్ దక్కకపోవడానికి రేవంతే కారణం అంటూ అసంతృప్తులు తీవ్ర స్థాయిలో విరుచుకుపుతున్నారు.
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో సెకండ్ లిస్ట్ రేపుతున్న మంటలు అన్నీ ఇన్నీ కావు. సంచలనాలకు కేరాఫ్‌గా కనిపించింది రెండో జాబితా. టికెట్ కచ్చితంగా వస్తుందని ఊహించిన కొందరు నేతలకు భారీ షాక్ తగిలింది. దీంతో టిక్కెట్ దక్కని నేతలు ఎవరికి వారు తమ దారి చూసుకుంటున్నారు. తమకు టికెట్ దక్కకపోవడానికి రేవంతే కారణం అంటూ అసంతృప్తులు తీవ్ర స్థాయిలో విరుచుకుపుతున్నారు. కాంగ్రెస్ సెకండ్ లిస్ట్‌లో సీట్ కన్ఫామ్ కాని నేతలు కొందరు పార్టీకి రాజీనామాలు చేస్తుంటే.. మరికొందరు రెబల్స్‌గా పోటీకి సిద్ధమవుతున్నారు.
మైనారిటీ శాఖ ఛైర్మన్ షేక్ అబ్దుల్లా సోహెల్ పార్టీకి రాజీనామా చేశారు. కూకట్‌పల్లి టికెట్ దక్కకపోవటంతో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గొట్టిముక్కల వెంగళరావు రాజీనామా చేశారు. ఇక్కడి టికెట్‌ను శేరిలింగంపల్లికి చెందిన బండి రమేష్‌కు కేటాయించింది కాంగ్రెస్. దీంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. జడ్చర్ల నుంచి టికెట్ ఆశించిన ఎర్ర శేఖర్.. హస్తానికి గుడ్ బై చెప్పారు. జూబ్లీహిల్స్ టికెట్ దక్కకపోవడంతో విష్ణువర్థన్ రెడ్డి అనుచరులు గాంధీభవన్‌లో హల్ చల్ చేశారు. విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక అటు ఎల్లారెడ్డిలో రెబెల్ అభ్యర్థిగా రంగంలో ఉంటానని సుభాష్ రెడ్డి ప్రకటించారు. కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో సుభాష్‌రెడ్డి కన్నీరుమున్నీరయ్యారు. కాంగ్రెస్ పదవులన్నింటికీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సుభాష్ రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మదన్‌ను గెలవనివ్వనని సవాల్ చేశారు. కామారెడ్డిలోని 4 నియోజకవర్గాల్లో తాను పోటీగా అభ్యర్థులను నిలబెడతా అని సవాల్ చేశారు.
కామారెడ్డిలో పోటీ చేయాలనుకుంటున్న రేవంత్‌రెడ్డి ఎలా గెలుస్తారో చూస్తానని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముధోల్ నుంచి టికెట్ ఆశించిన విజయ్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ మీద గుర్రుగా ఉన్నారు. రేవంత్‌ను తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారు. ఆయన కూడా పార్టీ మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయ్. ఓవరాల్‌గా సెకండ్ లిస్ట్.. కాంగ్రెస్‌లో రేపుతున్న అలజడి అంతా ఇంతా కాదు. దీంతో జంపింగ్ జపాంగ్‌లు ఊపందుకున్నాయ్.