Telangana Ministers : తెలంగాణ మంత్రుల శాఖలు ఇవే !
తెలంగాణలో కొత్తగా ప్రమాణం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. ఆయా మంత్రులు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని శాఖలను కేటాయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కీలకమైన హోంశాఖ, మున్సిపల్ వ్యవహారాలు, విద్యాశాఖలను తన దగ్గరే పెట్టుకున్నారు సీఎం. ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో ఆయనతో సహా 12 మంది ఉన్నారు. మరో ఆరుగురు మంత్రులను ఇంకా చేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఈలోగా ప్రమాణం చేసిన మంత్రులకే అదనపు శాఖలను కూడా అప్పగించారు సీఎం రేవంత్.

తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. శుక్రవారం నాడు ఢిల్లీ వెళ్ళి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అధిష్టానం పెద్దల దగ్గర మంత్రుల శాఖలకు సంబంధించి డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు కొద్దిసేపటి ముందే మంత్రుల శాఖలను ప్రకటించారు సీఎం రేవంత్.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కీలకమైన హోంశాఖతో పాటు మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ, సాధారణ పరిపాలనాశాఖ, విద్యతో పాటు ఇతర మంత్రులకు కేటాయించిన శాఖలన్నీ ఉంటాయి. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రెవెన్యూ, ప్లానింగ్ శాఖతో పాటు విద్యుత్ శాఖను అప్పగించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి, సివిల్ సప్లయీస్ తో పాటు నీటిపారుదల శాఖను ఎలాట్ చేశారు. కేబినెట్ లో మరో సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, రోడ్లు భవనాల శాఖతో పాటు సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించారు. మాజీ మంత్రి కేటీఆర్ తర్వాత.. ఐటీ బాధ్యతలు ఎవరికి ఇస్తారు అన్న చర్చ సోషల్ మీడియాలో బాగా నడిచింది. అనుకున్నట్టు ఈ శాఖను దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు అప్పగించారు. ఐటీతో పాటు పరిశ్రమలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖను అప్పగించారు. మరో సీనియర్ లీడర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రెవెన్యూశాఖతో పాటు హౌసింగ్, సమాచార శాఖల బాధ్యతలను ఇచ్చారు. కొండా సురేఖకు అటవీశాఖతో పాటు దేవాదాయ శాఖను అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి.
గతంలో వివిధ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయ శాఖ, దాని అనుబంధ శాఖలతో పాటు చేనేతను కూడా అప్పగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హమీలను నెరవేర్చాల్సి ఉన్నందున.. అలాంటి కీలకమైన శాఖను తుమ్మలకు ఇచ్చారు. జూపల్లి కృష్ణారావుకు ఎక్సైజ్ శాఖతో పాటు టూరిజం శాఖను కేటాయించారు. పొన్నం ప్రభాకర్ కు రవాణా శాఖతో పాటు.. బీసీ సంక్షేమ శాఖలను ఎలాట్ చేశారు. ప్రస్తుతం మహిళలు ఉచిత బస్సు సౌకర్యం పథకం.. పొన్నం ఆధ్వర్యంలో ప్రారంభం కానుంది. మరో సీనియర్ నేత దామోదర రాజనర్సింహకు వైద్య ఆరోగ్యంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖను అప్పగించారు. హోంశాఖను సీతక్క లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఈ పదవిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన దగ్గరే ఉంచుకున్నారు.