TELANGANA CONGRESS: కామారెడ్డి నుంచి రేవంత్‌.. షబ్బీర్ అలీ అక్కడి నుంచి.. కాంగ్రెస్‌ సెకండ్ లిస్ట్ ఇదే..

ఒక్కో పేరు ఫైనల్ చేయడానికి సీఈసీ పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఈలోపు పార్టీలోకి భారీగా చేరికలు రావడంతో.. ముందుగా అనుకున్న సెకండ్‌ లిస్ట్‌లో చిన్న చిన్న మార్పులు చేసింది కాంగ్రెస్. కామారెడ్డిలో కేసీఆర్ మీద పోటీ చేస్తానని ప్రకటించిన రేవంత్‌కు.. అక్కడి నుంచి అవకాశం ఇచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 27, 2023 | 05:15 PMLast Updated on: Oct 27, 2023 | 5:15 PM

Telangana Congress Second List Is Ready Revanth From

TELANGANA CONGRESS: కాంగ్రెస్‌ ప్రకటించబోయే రెండో జాబితాపై ప్రతీ ఒక్కరిలో ఆసక్తి కనిపిస్తోంది. ఆచితూచి, వడపోసి.. ఒక్కో పేరు ఫైనల్ చేయడానికి సీఈసీ పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఈలోపు పార్టీలోకి భారీగా చేరికలు రావడంతో.. ముందుగా అనుకున్న సెకండ్‌ లిస్ట్‌లో చిన్న చిన్న మార్పులు చేసింది కాంగ్రెస్. కామారెడ్డిలో కేసీఆర్ మీద పోటీ చేస్తానని ప్రకటించిన రేవంత్‌కు.. అక్కడి నుంచి అవకాశం ఇచ్చింది. కొడంగల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా రేవంత్ పోటీ చేయబోతున్నారు.

కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ చూస్తే.. కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ నుంచి షబ్బీర్ అలీ, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖైరతాబాద్ నుంచి విజయా రెడ్డి, అంబర్ పేట్‌ నుంచి రోహిన్ రెడ్డి, కూకట్‌పల్లి నుంచి బండి రమేష్, ఎల్బీనగర్‌ నుంచి మధు యాష్కీ గౌడ్‌, తాండూర్‌ నుంచి మనోహర్ రెడ్డి, వనపర్తి నుంచి మేఘా రెడ్డి, జడ్చర్ల నుంచి అనిరుధ్‌ రెడ్డి, నారాయణపేట నుంచి ఎర్ర శేఖర్‌, దేవరకొండ నుంచి బాలు నాయక్, భువనగిరి నుంచి కుంభం అనిల్ కుమార్ రెడ్డి, సూర్యాపేట్‌ నుంచి పటేల్ రమేష్ రెడ్డి, మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇల్లందు నుంచి కోరం కనకయ్య, ఆసిఫాబాద్ నుంచి శ్యామ్ నాయక్, ఆదిలాబాద్‌ నుంచి కంది శ్రీనివాస్ రెడ్డి, ఖానాపూర్ నుంచి ఎడ్మ బొజ్జు, బోధ్‌ నుంచి బాబూరావు రాథోడ్‌కు అవకాశం దక్కింది.

కరీంనగర్‌ నుంచి సంతోష్ కుమార్, బాన్సువాడ నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి, హుస్నాబాద్‌ నుంచి పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల నుంచి మహేందర్ రెడ్డి, చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం, కోరుట్ల నుంచి జువ్వాడి నర్సింగ్ రావు, జుక్కల్ నుంచి లక్ష్మీ కాంతారావు, ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ రావు, వరంగల్ ఈస్ట్‌ నుంచి కొండా సురేఖ, మహేశ్వరం నుంచి కిచ్చన్నగారి లక్మారెడ్డి, శేరిలింగం పల్లి నుంచి జగదీశ్వర్ గౌడ్‌కు అవకాశం దక్కింది.