AGAIN TELANGANA SLOGAN : మళ్లీ తెలంగాణ సెంటిమెంట్.. పథకాలు వర్కౌట్ ఐతలేదు..!

రాష్ట్ర సాధన ఉద్యమంలో యాక్టివ్ గా పాల్గొన్న TRS.. తెలంగాణలో రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. ఈ టూ టైమ్స్ కూడా BRS చీఫ్ కేసీఆర్.. తెలంగాణ సెంటిమెంట్ నే నమ్ముకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 9, 2023 | 02:53 PMLast Updated on: Nov 09, 2023 | 2:53 PM

Telangana Sentiment Again Schemes Did Not Work Out

రాష్ట్ర సాధన ఉద్యమంలో యాక్టివ్ గా పాల్గొన్న TRS.. తెలంగాణలో రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. ఈ టూ టైమ్స్ కూడా BRS చీఫ్ కేసీఆర్.. తెలంగాణ సెంటిమెంట్ నే నమ్ముకున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ను, టీడీపీని దెబ్బతీయడానికి మళ్ళీ ఆంధ్రోళ్ళకి పెత్తనం ఇద్దామా అంటూ సవాళ్ళు విసిరారు. సరే.. జనం కూడా సెంటిమెంట్ ప్లస్ ఆకర్షక పథకాలు చూసి ఓట్లేశారు. వరుసగా 10 యేళ్ల పాటు brs కు అధికారం కట్టబెట్టారు.

MLC Kavitha : బోధన్ ర్యాలీ పాల్గొనేందుకు.. బైక్ పై వెళ్లిన ఎమ్మెల్సీ కవిత..

2023 ఎన్నికల్లో ప్రజాకర్షక పథకాలతో BRS కు ఓట్లు రాలే పరిస్థితి కనిపించడం లేదు. ఏ పథకం చూసినా సగంలోనే ఆగిపోయింది. లబ్ధిదారులు లక్షల్లో ఉంటే.. పథకాలు అందుకున్న వారు వందల్లో, వేలల్లో ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, ఇళ్ళు కట్టుకోడానికి ఐదు లక్షలు.. దళితులకు మూడెకరాలు, రైతులకు లక్ష లోపు రుణమాఫీ, ఎస్టీ రిజర్వేషన్లు, దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి లాంటి ఎన్నో పథకాలు ముందుకు సాగలేదు. ఆ పథకాలకు అప్లయ్ చేసిన జనం యేళ్ళ తరబడిగా సర్కారీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో BRS అభ్యర్థులను జనం నిలదీస్తున్నారు. సో.. ఈ టైమ్ లో స్కీమ్స్ వర్కవుట్ కావని గులాబీ బాస్ కి అర్థమైంది. అందుకే సింగిల్ ఎజెండాతో ముందుకెళ్తున్నారు. అదే తెలంగాణ సెంటిమెంట్.. కాంగ్రెస్ మోసం చేసింది అనే కాన్సెప్ట్. దీన్నే మాగ్జిమమ్ జనంలోకి తీసుకెళ్ళేందుకు కేసీఆర్.. ప్రతి బహిరంగ సభలోనూ ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమంలో కాంగ్రెస్ అడ్డుకోవడం వల్లే.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు లేట్ అయిందని తరుచుగా చెబుతున్నారు. కేటీఆర్ కూడా ఇదే పాయింట్ తో ప్రచారం చేస్తున్నారు.

KCR nomination : రెండు నియోజకవర్గాల్లో గజ్వేల్ – కామారెడ్డి లో కేసీఆర్ నామినేషన్..

తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తుండటంతో దాన్ని అడ్డుకోవాలంటే.. తెలంగాణ సెంటిమెంట్ తో భావోద్వేగాలు లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు BRS చీఫ్. కాంగ్రెస్ కి అధికారం ఇస్తే.. ఢిల్లీ బాస్ ల చేతుల్లోకి వెళ్తుందనీ, మనకు వచ్చే కంపెనీలు కర్ణాటక పోతాయని.. బెదిరిస్తున్నారు కేటీఆర్ అండ్ కేటీఆర్. అంతేకాదు.. ఇప్పుడు కొత్తగా చంద్రబాబును కూడా తెర మీదకు పట్టుకొచ్చారు. కాంగ్రెస్ వస్తే ఆంధ్రా నాయకుడు చంద్రబాబు చెప్పుచేతల్లోకి వెళ్తుందని.. పరోక్షంగా రేవంత్ రెడ్డి బ్యాక్ గ్రౌండ్ ని గుర్తు తెస్తున్నారు.

Chandrababu : ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా..!

ఈ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి, జై భారత్… నినాదాలు కూడా వినిపించడం లేదు. పార్టీ పేరు మార్చాక.. జై భారత్.. జై BRS అంటూ స్పీచెస్ ముగించేవారు కేసీఆర్. కానీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో.. మళ్ళా జై తెలంగాణ నినాదమే వినిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చాక అంతగా జనాల్లోకి వెళ్ళలేదన్న టాక్ ఉంది. ఎన్నికల వేళ జై brs ఎందుకని.. సెంటిమెంట్ వర్కవుట్ కోసం జై తెలంగాణనే మళ్ళీ అందుకున్నారు కేసీఆర్. మొత్తానికి తెలంగాణలో మూడోసారి కూడా అధికారంలోకి రావాలంటే తెలంగాణ సెంటిమెంట్ తప్పదని భావిస్తున్నారు.. గులాబీ బాస్.