TDP : యువగళం పాదయాత్రకు తాత్కాలిక విరామం.. తుఫాన్ కారణంగా యాత్రకు బ్రేక్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఆంధ్రప్రదేశ్ కు మిచౌగ్ తుఫాన్ ప్రభావం పొంచి ఉండటంతో.. లోకేష్ యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఇక రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. వాతావరణ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఆంధ్రప్రదేశ్ కు మిచౌగ్ తుఫాన్ ప్రభావం పొంచి ఉండటంతో.. లోకేష్ యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఇక రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. వాతావరణ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 7న మళ్ళీ పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ముఖ్యంగా విశాఖపట్నం, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం వంటి పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలోనే మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు. మరోవైపు తుపాను ప్రభావంతో ఏపీ అప్రమత్తమైంది.
Cyclone Michoung : ఆంధ్రప్రదేశ్ కు పొంచి ఉన్న మిచౌంగ్ తుఫాన్.. తెలంగాణలో వర్షాలు..
నేడు, రేపు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ప్రజలు ఎవ్వరు కూడా ఎలాంటి పుకార్లను నమ్మవద్దని.. ప్రశాంతంగా ఉండాలని.. సూచించారు. అత్యవసర కమ్యూనికేషన్ కోసం మీ మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసుకుంటూ ఉండాలని సూచించారు. వాతావరణ హెచ్చరికల కోసం మెసేజ్‌లను గమనిస్తూ ఉండాలన్నారు. ప్రజలు విలువైన పత్రాలు, సర్టిఫికేట్స్, విలువైన వస్తువుల్ని వాటర్ ప్రూఫ్ కంటైనర్లు, కవర్‌లో ఉంచి జాగ్రత్త చేసుకోవాలని ప్రభుత్వ అధికారులు సూచించారు. కాగా ఇప్పటికే నారా లోకేష్ పాదయాత్ర పలు మార్లు వాయిదా పడింది. చంద్రబాబు అరెస్టుతో దాదాపు నెల రోజులుగా.. యువగళం పాదయాత్ర వాయిదా పడిన విషయం తెలిసిందే..