Congress : కాంగ్రెస్ లో సీఎం రేస్ మొదలైంది ! తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు ?

క్లియర్ మెజారిటీతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టబోతోంది. ఆ పార్టీలో అసలు ఆట ఇప్పుడే మొదలైంది. ముఖ్యమంత్రి నేనంటే నేనని కుమ్ములాటలు స్టార్ట్ అవుతాయి. ప్రధానంగా సీఎం రేసులో రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క మాత్రమే ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరిని అధిష్టానం సీఎంగా ఎంపిక చేస్తుందన్నది హాట్ టాపిక్ గా మారింది. కోమటి రెడ్డి, ఉత్తమ్, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి లాంటి మిగతా లీడర్లు రేసులో లేకపోయినా... సీఎం సీటు విషయంలో ఎవరికి సహకరిస్తారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 3, 2023 | 03:35 PMLast Updated on: Dec 03, 2023 | 3:35 PM

The Cm Race Has Started In Congress Who Is The Chief Minister Of Telangana

క్లియర్ మెజారిటీతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టబోతోంది. ఆ పార్టీలో అసలు ఆట ఇప్పుడే మొదలైంది. ముఖ్యమంత్రి నేనంటే నేనని కుమ్ములాటలు స్టార్ట్ అవుతాయి. ప్రధానంగా సీఎం రేసులో రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క మాత్రమే ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరిని అధిష్టానం సీఎంగా ఎంపిక చేస్తుందన్నది హాట్ టాపిక్ గా మారింది. కోమటి రెడ్డి, ఉత్తమ్, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి లాంటి మిగతా లీడర్లు రేసులో లేకపోయినా… సీఎం సీటు విషయంలో ఎవరికి సహకరిస్తారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

తెలంగాణ సీఎం రేసులో ఉన్న రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్.. పొలిటికల్ ఫైర్ బ్రాండ్. ఆర్థికంగా సత్తా ఉన్నవాడు. కాంగ్రెస్ తరపున అన్ని నియోజకవర్గాల్లో తిరిగి స్టార్ క్యాంపెయిన్ చేశాడు. భట్టి విక్రమార్క ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోనే ప్రచారం చేయగా.. మిగతా సీనియర్లయితే తమ నియోజకవర్గాలు దాటి రాలేదు. ఇక రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాకే కాంగ్రెస్ కి ఒక ఊపు వచ్చింది. అగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తాడని పేరుంది. తెలంగాణలో రెడ్డి లాబీయింగ్ కూడా ఎక్కువే. అన్నిటికన్నా అధిష్టానానికి నిధులు సమకూర్చడంలో దిట్ట. వచ్చే ఏడాదిలో జరిగే లోక్ సభ ఎన్నికలకి పార్టీకి కావల్సిన అన్ని రకాల నిధులను సమకూర్చే సత్తా ఉంది. కానీ రేవంత్ రెడ్డికి ఉన్న కొన్ని మైనస్ పాయింట్స్ ఆయన్ని సీఎం పదవికి కొంచెం దూరం పెడుతున్నాయి. ఆయన బ్లాక్ మెయిల్ చేస్తాడని పేరుంది. పార్టీ నేతలపైనే అసత్య ప్రచారాలు చేయిస్తాడని ఆరోపణులున్నాయి. RTI ని అడ్డం పెట్టుకొని గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తల్ని బ్లాక్ మెయిల్ చేశాడనీ… బెదిరించాడని చెబుతారు. ఇంకా భూదందాలు, సెటిల్మెంట్లు చేస్తాడని టాక్. అంతెందుకు… కాంగ్రెస్ అధిష్టానంలోనే కొందరు పెద్దల్ని కొనేశాడని టాక్ కూడా పార్టీ వర్గాల్లో ఉంది. రేవంత్ మొదటి నుంచీ కాంగ్రెస్ కి చెందిన వ్యక్తి కాదు… టీడీపీ నుంచి వచ్చాడు. ఆయనకు చంద్రబాబుతో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని మరో విమర్శ కూడా ఉంది.

ఇక మల్లు భట్టి విక్రమార్క విషయానికి వస్తే.. ఎస్సీ మాల. అసలు సిసలైన కాంగ్రెస్ పార్టీ లీడర్. 50 ఏళ్ళుగా కాంగ్రెస్ లో ఉన్న కుటుంబం వాళ్ళది. పెద్దన్న మల్లు అనంత రాములు పీసీసీ అధ్యక్షుడు, ఎంపీగా చేశారు. భట్టి చిన్నన్న మల్లురవి ఎంపీగా, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా చేశారు. భట్టి మంచి విద్యావేత్త కూడా. సెంట్రల్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. ఇంగ్లీష్, హిందీ బాగా మాట్లాడగలడు. సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాడు కూడా. ఆయన కుటుంబం అంతా బాగా చదువుకున్నది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. కాంగ్రెస్ లో ఎస్సీ లాబీయింగ్ కూడా బాగానే ఉంది. భట్టి ఓసారి ఎమ్మెల్సీగా, మూడుసార్లు ఎమ్మెల్యే గా గెలిచాడు. మితభాషి. రాహుల్ గాంధీకీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి దగ్గరవాడు. ఉమ్మడి ఏపీలోని కాంగ్రెస్ నాయకులు అందరికీ సన్నిహితుడు కూడా. ఎన్నికలకు ముందు తెలంగాణ జిల్లాల్లో పాదయాత్ర చేసి… కాంగ్రెస్ ఉనికిని మరోసారి చాటాడు భట్టి విక్రమార్క.

భట్టి మైనస్ పాయింట్స్ చూస్తే.. ఆయన క్రౌడ్ పుల్లర్ కాదు. జనాన్ని కూడగట్టగలిగే శక్తి లేదు. ఆర్థికంగా కూడా వీక్. ఖమ్మం జిల్లాకే పరిమితమైన నాయకుడు. అధిష్టానాన్ని ఎంతవరకు ఆర్థికంగా ఆదుకుంటాడు అనేది డౌటే. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కి వలస పోతుంటే.. సీఎల్పీ నేతగా ఉండి కూడా కాపాడలేకపోయాడు. రేవంత్ రెడ్డితో పోలిస్తే భట్టికి పాపులారిటీ కూడా తక్కువే.
ఇప్పుడు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క.. ఈ ఇద్దరు నేతల్లో AICC ఎవర్ని ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తుంది అన్నది చూడాలి. భట్టిని సీఎంగా చేసి… తెలంగాణకు ఎస్సీని ముఖ్యమంత్రిని చేసామన్న మాట నిలబెట్టుకోవచ్చు. కేసీఆర్ సరిగ్గా ఇదే మాట ఇచ్చి మోసం చేశారు. దాంతో కాంగ్రెస్ ఎస్సీలకు ప్రాధాన్యత ఇచ్చింది అన్నది జనంలోకి తీసుకెళ్లొచ్చు. పార్టీకి విధేయుడు కనక విధేయులకే గుర్తింపు ఇచ్చామని కూడా చెప్పుకోవచ్చు. వివాదాలేని వ్యక్తి కనుక భట్టి అధిష్టానం చెప్పింది వింటాడు. కానీ రెడ్డి లాబీయింగ్ రేవంత్ ను కాకుండా వేరొకరిని అంగీకరిస్తుందా… రేపు అధిష్టానాన్ని కూడా ఆర్థికంగా ఆదుకోవాల్సిన రేవంత్ ను AICC వదులుకుంటుందా అన్నది కూడా చూడాలి.