BRS Manifesto : బీఆర్ఎస్ మేనిఫెస్టోలో హామీలు ఇవే..
తెలంగాణలో ఎన్నికల యుద్ధం పీక్స్‌కు చేరుకుంది. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న కేసీఆర్.. ఎలక్షన్ సమరంలో గర్జించేందుకు సిద్ధం అవుతున్నారు. అచ్చొచ్చిన హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నారు. అంతకుముందు పార్టీ ఆఫీస్‌లో బీఆర్ఎస్ అభ్యర్థులతో భేటీ అయి.. మేనిఫెస్టో అనౌన్స్ చేశారు. అభ్యర్థులకు బీఫామ్‌లు ఇచ్చి.. ఎన్నికల కదన రంగంలోకి పంపించనున్నారు కేసీఆర్.

The election war in Telangana has reached its peaks KCR who has been silent for many years is preparing to roar in the election campaign
తెలంగాణలో ఎన్నికల యుద్ధం పీక్స్‌కు చేరుకుంది. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న కేసీఆర్.. ఎలక్షన్ సమరంలో గర్జించేందుకు సిద్ధం అవుతున్నారు. అచ్చొచ్చిన హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నారు. అంతకు ముందు పార్టీ ఆఫీస్‌లో బీఆర్ఎస్ అభ్యర్థులతో భేటీ అయి.. మేనిఫెస్టో అనౌన్స్ చేశారు. అభ్యర్థులకు బీఫామ్‌లు ఇచ్చి.. ఎన్నికల కదన రంగంలోకి పంపించనున్నారు కేసీఆర్. కేసీఆర్ ప్రకటించబోయే మేనిఫెస్టోపైనే ఇప్పుడు ప్రతీ ఒక్కరి దృష్టి కనిపిస్తోంది. 2018 మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలతో పాటు.. అందులో లేని చాలా కార్యక్రమాలను ఈ ఐదేళ్లలో చేపట్టింది బీఆర్ఎస్ సర్కార్. విజయవంతంగా అమలు చేసి చూపించింది కూడా ! ఈసారి ప్రభుత్వంపై జనాలు మరిన్ని ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ఆరు గ్యారెంటీలు అంటూ దూసుకుపోతోంది. దీంతో బీఆర్ఎస్ మేనిఫెస్టో ఎలా ఉంటుందంటే అంటూ హరీష్ లాంటి నేతలు ఆసక్తి పెంచారు. మహిళలకు పెద్దపీట వేస్తారని.. అన్ని వర్గాలకు మేనిఫెస్టోలో చోటు ఉంటుందని హింట్ ఇచ్చారు. ఆ క్యూరియాసిటీ కాస్త ఇప్పుడు పీక్‌స్టేజీకి చేరుకుంది.
ఐతే రైతు బంధు, రైతు బీమా పథకాల కింద ఇస్తున్న నగదు సాయాన్ని మరింత పెంచుతూ మేనిఫెస్టోలో హామీలు ఉండే ఛాన్స్ ఉంది. మహిళా సాధికారత కోసం కొత్త పథకాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు పథకాలను మరింత సమర్థంగా అమలు చేయడం, మరింత మందికి ఆర్థిక సాయం చేసేందుకు బడ్జెట్ కేటాయింపులు పెంచడం లాంటి హామీలు మేనిఫెస్టోలో ఉండే అవకాశముంది. మధ్య తరగతిని ఆకర్షించేందుకు వివిధ పథకాలను ప్రవేశపెట్టబోతున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ గ్యారంటీలు తలదన్నేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో తయారైందని తెలుస్తోంది.