Babu Mohan : తండ్రీ కొడుకులను విడదీసిన రాజకీయం.. బీఆర్‌ఎస్‌లోకి బాబు మోహన్‌ కొడుకు..

రాజకీయం (Politics) రాజకీయం నెవ్వేం చేస్తావ్‌ అంటే.. అన్నాదమ్ములను శతృవులుగా మారుస్తాను.. తండ్రీ కొడుకులను విడదీసి చూపిస్తాను అందట. ఈరోజుల్లో రాజకీయాలు నిజంగా అలాగే ఉన్నాయి. చెప్పడానికి ఇది సామెతలాగే ఉన్నా.. ఆందోల్‌ నియోజకవర్గంలో ఇదే నిజమైంది. బీజేపీ సీనియర్ నాయకుడు, యాక్టర్‌ మోహన్‌ బాబు (Babu Mohan) కొడుకు ఉదయ్‌ తండ్రిని కాదని పార్టీ మారబోతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 19, 2023 | 01:30 PMLast Updated on: Nov 19, 2023 | 1:30 PM

The Politics That Separated Father And Son Babu Mohans Son Joined Brs

రాజకీయం (Politics) రాజకీయం నెవ్వేం చేస్తావ్‌ అంటే.. అన్నాదమ్ములను శతృవులుగా మారుస్తాను.. తండ్రీ కొడుకులను విడదీసి చూపిస్తాను అందట. ఈరోజుల్లో రాజకీయాలు నిజంగా అలాగే ఉన్నాయి. చెప్పడానికి ఇది సామెతలాగే ఉన్నా.. ఆందోల్‌ నియోజకవర్గంలో ఇదే నిజమైంది. బీజేపీ సీనియర్ నాయకుడు, యాక్టర్‌ మోహన్‌ బాబు (Babu Mohan) కొడుకు ఉదయ్‌ తండ్రిని కాదని పార్టీ మారబోతున్నారు. మంత్రి హరీష్‌ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ముందు నుంచీ రాజకీయాల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు ఉదయ్‌. పార్టీ మీటింగ్‌ మొదలు అన్ని సందర్భంగా సపోర్ట్‌ చేస్తూ వచ్చారు. కొంత కాలం నుంచి ఆందోల్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఉదయ్‌ ఆశిస్తున్నారు.

Etela Rajender: ఈటెలకు సొంత కారు కూడా లేదా.. ఎలక్షన్‌ అఫిడవిట్‌లో ఇంట్రెస్టింగ్‌ విషయాలు..

తనకు టికెట్‌ ఇవ్వాలంటూ స్వయంగా, తండ్రి ద్వారా హైకమాండ్‌ను కోరారు. కానీ బీజేపీ హైకమాండ్‌ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ రాలేదు. ఉదయ్‌ని కాదని బాబు మోహన్‌కే టికెట్‌ కేటాయించింది బీజేపీ హై కమాండ్‌. దీంతో ఉదయ్‌ తీవ్ర అసతృప్తికి గురయ్యారు. టికెట్‌ ఇవ్వని పార్టీలో ఎందుకు ఉండాలి అనుకున్నారో ఏమో.. తండ్రి ఉన్నారు అని కూడా చూడకుండా పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. బీఆర్‌ఎస్‌లో చేరేందుకు గ్రౌండ్ ప్రిపేర్‌ చేసుకున్నారు. దీంతో ఆందోల్‌ రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు బాబు మోహన్ బీజేపీ నుంచి ఆయన కొడుకు బీఆర్‌ఎస్‌ నుంచి ప్రచారం చేయబోతున్నారు. దీంతో క్యాడర్‌ కన్‌ఫ్యూజన్‌లో పడింది. ఇప్పటికే రాష్ట్రంలో కొంత కాలం నుంచి బీజేపీ వీక్‌ అయ్యింది. దీనికి తోడు బీజేపీ ఓట్‌బ్యాంక్‌ చాలా వరకూ కాంగ్రెస్‌కు మళ్లింది. ఇలాంటి టైంలో కన్న కొడుకే హ్యాండిచ్చి పార్టీ మారడంతో బాబు మోహన్‌ పరిస్థితి డేంజర్‌లో పడింది.