Mulugu MLA Sitakka : నాపై కుట్ర చేస్తున్నారు.. ధర్నాకు దిగిన సీతక్క..
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారం అనడం కంటే.. అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ఆరోపణలు యుద్ధం జరుగుతోంది అంటే కరెక్ట్‌గా ఉంటుందేమో. అదే స్థాయిలో ఒకరిపై ఒకరు ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్నారు అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు. ప్రత్యర్థులపై బురద జల్లేందుకు ఉన్న చిన్న అవకాశాన్ని కూడా వదలిపెట్టుకోవడంలేదు.

They are plotting against me.. Mulugu MLA Congress candidate Sitakka who went on dharna..
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారం అనడం కంటే.. అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ఆరోపణలు యుద్ధం జరుగుతోంది అంటే కరెక్ట్‌గా ఉంటుందేమో. అదే స్థాయిలో ఒకరిపై ఒకరు ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్నారు అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు. ప్రత్యర్థులపై బురద జల్లేందుకు ఉన్న చిన్న అవకాశాన్ని కూడా వదలిపెట్టుకోవడంలేదు. ఇదే క్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క.. అర్ధరాత్రి ధర్నాకు దిగారు. ములుగు రిటర్నింట్ కార్యాలయం ముందు బైఠాయించారు. దీనికి కారణం.. ఎన్నికల అధికారులు ముద్రించిన బ్యాలెట్ నమూనా పేపర్. ఈ పేపర్‌లో తన ఫొటో చిన్నగా ఉందంటూ సీతక్క ధర్నాకు దిగారు. పేపర్‌లో ఉన్న అందరి మోహాలు, గుర్తులు క్లియర్‌గా కనిపించేలా ముద్రించారని చెప్పారు సీతక్క.
Telangana Elections : ఆఖరివారం అత్యంత కీలకం.. అగ్రనేతలంతా తెలంగాణలోనే..
ఇదే విషయంలో కొన్ని రోజుల ముందే ఎన్నికల అధికారులను సీతక్క వివరణ కోరారట. కానీ అధికారుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని చెప్తున్నారామె. నిన్నటి వరకూ వేచి చూసిన సీతక్క.. అధికారులు ఎంతకూ స్పందించకపోవడంతో నేరుగా రిటర్నింగ్ ఆఫీస్‌కి వెళ్లారు. అధికారులు లేకపోవడంతో కార్యాలయం ముందే బైఠాయించారు. సీతక్కతో పాటే.. ఆమె అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రిటర్నింగ్ ఆఫీస్ ముందు బైఠాయించారు. దీంతో అర్ధరాత్రి ములుగు రిటర్నింగ్ కార్యాలయం ముందు ఉద్రిక్తత నెలకొంది. అధికారులు బీఆర్‌ఎస్ నేతలకు కొమ్ముకాస్తున్నారంటూ సీతక్క ఆరోపించారు. తనను ఓడించేందుకే ఉద్దేశపూర్వంగా తన ఫొటో చిన్నగా ముద్రించారంటూ చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తాను మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టి తీరతానని చెప్పారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతీ ఒక్కరి అవినీతిని బయటపెడుతామంటూ వార్నింగ్ ఇచ్చారు.