Election Affidavits : బీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారిన అఫిడవిట్లు
ఈసారి తెలంగాణ ఎన్నికలను అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తెలంగాణలో పరిస్థితితులు చాలా మారిపోయాయి. ప్రభుత్వంపై ఏర్పడ్డ వ్యతిరేకత దృష్ట్యా.. ఎన్నికల్లో గెలిచే అవకాశాలు కాంగ్రెస్, బీజేపీకి కూడా ఉన్నాయి.
ఈసారి తెలంగాణ ఎన్నికలను అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తెలంగాణలో పరిస్థితితులు చాలా మారిపోయాయి. ప్రభుత్వంపై ఏర్పడ్డ వ్యతిరేకత దృష్ట్యా.. ఎన్నికల్లో గెలిచే అవకాశాలు కాంగ్రెస్, బీజేపీకి కూడా ఉన్నాయి. దీంతో ప్రతీ పార్టీ ఎలక్షన్‌ను చాలా సీరియస్ తీసుకుంది. ఇక అధికార బీఆర్‌ఎస్ మాత్రం ఓ అడుగు ముందే ఉండి.. ఎమ్మెల్యే అభ్యర్థుల అఫిడవిట్‌లు నింపేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసుకుంది. గత ఎన్నికల్లో అఫిడవిట్‌లో జరిగిన తప్పుల కారణంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా సమస్యలు ఎదుర్కున్నారు. ఈసారి ఆ తప్పులు జరగకూడదంటూ సీఎం కేసీఆర్ బీఫాంలు ఇచ్చిన రోజే అభ్యర్థులకు చాలా క్లియర్‌గా చెప్పారు. ప్రత్యేకంగా లాయర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. కానీ బీఆర్‌ఎస్ అభ్యర్థులు మాత్రం అఫిడవిట్ల విషయంలో మళ్లీ తప్పులు చేస్తున్నారు. దీంతో ప్రతిపక్ష నేతలు బీఆర్ఎస్ నేతల మీద వరుస ఫిర్యాదులు ఇస్తున్నారు.
Telangana elections : KCRకే కాదు.. మరో కీలక నేతకు వివేక్ అప్పు.. ఎన్ని కోట్లంటే..
గత ఎన్నికల్లో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారంటూ దాఖలైన పిటిషన్ రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఆ కేసు వివరాలు ఇప్పుడు దాఖలు చేసిన అఫిడవిట్‌లో వనమా మెన్షన్ చేయలేదంటూ మరోసారి ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇక మంత్రి పువ్వాడ అజయ్ అఫిడవిట్ కూడా ప్యాట్రన్ ప్రకారం లేదని.. వెంటనే నామినేషన్ రద్దు చేయాలంటూ జలగం వెంకట్రావు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక అలంపూర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి విజయుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ఎమ్మెల్యేగా నామినేషన్ వేశారంటూ కాంగ్రెస్, బీఎస్పీ నేతలు ఆందోళన చేపట్టారు. విజయుడు తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు ఎక్కడా ఆధారాలు లేవని.. ఉద్యోగంలో కంటిన్యూ అవుతూనే నామినేషన్ వేశాడని.. వెంటన ఆ నామినేషన్‌ను రద్దు చేయాలంటూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలా బీఆర్‌ఎస్ పార్టీ అఫిడవిట్ల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అభ్యర్థులు తప్పులు చేస్తూనే ఉన్నారు. ప్రతిపక్షాలకు కాలందిస్తూనే ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్‌పస్ పార్టీకి ఇది పెద్ద సమస్యగా మారింది.