Traffic diversion : నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ మళ్లింపు.. కొత్త సీఎం ప్రమాణ స్వీకారం సందర్భంగా.. ట్రాఫిక్ మళ్లింపు
నేడు తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడబోతుంది. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా మాజీ ఎంపీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ నగర ప్రజలకు డీజీపీ రవిగుప్తా తెలిపారు.
నేడు తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడబోతుంది. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా మాజీ ఎంపీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ నగర ప్రజలకు డీజీపీ రవిగుప్తా తెలిపారు. కొత్త సీఎంకు భారీ బందోబస్తు.. భద్రత విధుల్లో సీఎం సెక్యూరిటీ విభాగంతో పాటు ఆక్టోపస్, శాంతి భద్రతలు, టాస్క్‌ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, సీఏఆర్ విభాగాలు, సాయుధ బలగాల సిబ్బంది పాల్గోనున్నారు. గురువారం ఉదయం నుంచే ఆయా ప్రాంతాల్లో నిఘా, తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు పెద్ద ఎత్తున మఫ్టీ పోలీసులను మోహరించారు. రూఫ్ టాప్ వాచ్ కోసం స్టేడియం చుట్టుపక్కల ఎత్తెన బిల్డింగ్స్‌పైన సుశిక్షితులైన సాయుధ బలగాలను మోహరిస్తున్నారు. స్టేడియం చుట్టూ రహదారుల్లో నిలిచిపోయిన ప్రజల సౌకర్యార్థం దాదాపు ఆరు భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని పోలీసులు ప్రతిపాదించారు. ఎల్బీ స్టేడియం చుట్టూ అనునిత్యం ప్యాట్రోలింగ్ నిర్వహించడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతున్నారు.
ట్రాఫిక్ ఆంక్షాలు..
పబ్లిక్ గార్డెన్స్ నుంచి స్టేడియం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపుకు మళ్లింపు.. ఎస్బీఐ గన్ ఫౌండ్రీ నుంచి వచ్చే వాహనాలను చాపెల్ రోడ్డు వైపు, బషీర్‌బాగ్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలను కింగ్ కోఠి వైపు, ఖాన్ లతీఫ్ ఖాన్ భవనం నుంచి వచ్చే వాహనాలను నాంపల్లి వైపు మళ్లించనున్నారు. నగర ప్రజలు సహకరించాలని.. ట్రాఫిక్ మళ్లింపు, రవీంద్రభారతి, హిల్‌ఫోర్ట్ రోడ్ వైపు నుంచి బీజేఆర్ స్టాచ్యూ వైపు వచ్చే వాహనాలను సుజాత హైస్కూల్ మీదుగా, బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే వాహనాలను చాపెల్ రోడ్ మీదుగా మళ్లిస్తారు. నారాయణగూడ సిమెట్రీ వైపు నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద, కింగ్ కోఠి, బొగ్గులకుంట వైపు మర్లింపు.. భారతీయ విద్యా భవన్‌్ మీదుగా వచ్చే వాహనాలను కింగ్ కోఠి చౌరస్తా నుంచి తాజ్‌మహల్ హోటల్ మీదుగా మళ్లిస్తారు. ట్రాఫిక్ లో ఇబ్బందులు తలెత్తునే / ఇతర ఇబ్బందులపై 9102033626 నెంబర్‌కు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు.