Congress : తుమ్మలకు ఖమ్మం.. పొంగులేటికి పాలేరు.. పోటీపై ఎట్టకేలకు క్లారిటీ..
పంచాయితీలకు కేరాఫ్ అనిపిస్తుంటుంది కాంగ్రెస్. అది జూనియర్లు వర్సెస్ సీనియర్లు కావొచ్చు.. ఇప్పుడు టికెట్ల లొల్లి కావొచ్చు. రచ్చ లేకుండా ఏ కార్యం ముగియదు అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి హస్తం పార్టీలో ..! ఫస్ట్ లిస్ట్ ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్ధం అయింది. మొదటి జాబితాలో 70 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారనే విషయం కంటే.. ఖమ్మం లో ఎవరు ఎక్కడ అన్న దాని మీద ఆసక్తి కనిపిస్తోంది రాజకీయ వర్గాల్లో ! ముఖ్యంగా తుమ్మల, పొంగులేటి విషయంలో ఆ క్యూరియాసిటీ కాస్త పీక్స్‌కు చేరింది.

Tummala Nageswara Rao from Khammam, Ponguleti Srinivasa Reddy from Paleru They will contest as Congress candidates
పంచాయితీలకు కేరాఫ్ అనిపిస్తుంటుంది కాంగ్రెస్. అది జూనియర్లు వర్సెస్ సీనియర్లు కావొచ్చు.. ఇప్పుడు టికెట్ల లొల్లి కావొచ్చు. రచ్చ లేకుండా ఏ కార్యం ముగియదు అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి హస్తం పార్టీలో ..! ఫస్ట్ లిస్ట్ ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్ధం అయింది. మొదటి జాబితాలో 70 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారనే విషయం కంటే.. ఖమ్మం లో ఎవరు ఎక్కడ అన్న దాని మీద ఆసక్తి కనిపిస్తోంది రాజకీయ వర్గాల్లో ! ముఖ్యంగా తుమ్మల, పొంగులేటి విషయంలో ఆ క్యూరియాసిటీ కాస్త పీక్స్‌కు చేరింది. లెఫ్ట్ పార్టీలతో పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని సీపీఐ కి ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. దీంతో ఖమ్మం, పాలేరు స్థానం మాత్రమే ఖమ్మం జిల్లాలో ఖాళీగా ఉన్నాయి. ఆ రెండు నియోజకవర్గాల నుంచి తుమ్మల, పొంగులేటి లో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే సస్పెన్స్‌కు ఢిల్లీలో రాహుల్‌గాంధీ సాక్షిగా తెరపడింది.
ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ అభ్యర్ధులుగా బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ తో ఢిల్లీలో తుమ్మల భేటీ అయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్లిన తుమ్మల సమక్షంలో.. సీట్ల విషయంపై రాహుల్ చర్చించారు. ఆ తర్వాత తుమ్మలను ఖమ్మం నుంచి పోటీ చేయాల్సిందిగా రాహుల్ కోరినట్లు ఏఐసీసీ సమాచారం. మరో నేత పొంగులేటి తాను గతం నుంచి ఆశిస్తున్న పాలేరు నుంచే పోటీ పడనున్నారు. ఈ ఇద్దరి అభ్యర్ధిత్వాలు అధికారికంగా త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది. నిజానికి ఈ క్లారిటీ రావడానికి చాలా తతంగమే నడిచింది ముందు. తుమ్మల, పొంగులేటి.. ఇద్దరు కూడా ఆర్థికంగా, అంగబలం పరంగా చాలా స్ట్రాంగ్. దీంతో సీట్ల విషయంలో మీరే నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు సూచించారు. ఐతే అది ఎటూ తేలకపోవడంతో.. ఢిల్లీ పెద్దలు ఎంటర్ కావాల్సి వచ్చింది. రాహుల్ సమక్షంలో ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు తుమ్మల అంగీకారం తెలిపారు. తుమ్మల సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఖమ్మంలో ఎక్కువగా ఉన్నాయి. పైగా ఖమ్మంలో ఆయనకు మంచి పట్టు ఉంది. పాలేరు తో కంపేర్ చేస్తే ఖమ్మంలో విక్టరీ ఈజీ అవుతుందని సర్వేలు కూడా చెప్తున్నాయ్. దీంతో అన్ని ఆలోచించి.. ఖమ్మం నుంచి బరిలోకి దిగేందుకు తుమ్మల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏమైనా పెద్ద కన్ఫ్యూజన్‌కు ఎట్టకేలకు తెరపడింది.