Vijayashanti, Resignation : కాంగ్రెస్ కు విజయశాంతి రాజీనామా.. కాంగ్రెస్ గూటికి రాములమ్మ !?
తెలంగాణలో ఎన్నికల (Telangana Elections) వేళ బీజేపీ (BJP) కి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత విజయశాంతి పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాను కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ (BJP State President) అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) కి పంపారు. కొంతకాలంగా పార్టీలో ప్రాధాన్యత తగ్గిన కారణంగా విజయశాంతి పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

Vijayashanthi resigns from Congress Ramulamma joins Congress..!?
తెలంగాణలో ఎన్నికల (Telangana Elections) వేళ బీజేపీ (BJP) కి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత విజయశాంతి పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాను కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ (BJP State President) అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) కి పంపారు. కొంతకాలంగా పార్టీలో ప్రాధాన్యత తగ్గిన కారణంగా విజయశాంతి పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఏ పార్టీలో చేరబోతున్నారు అనే విషయం ప్రస్తుతానికి విజయశాంతి చెప్పకపోయినా.. త్వరలోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. 1998లో రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి మొదటి బీజేపీలోనే చేరారు.
ఆ తరువాత 2005 తల్లి తెలంగాణ పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. కానీ తన పార్టీ పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో 2009లో టీఆర్‌ఎస్‌లో తన పార్టీని విలీనం చేశారు. కానీ కొంత కాలానికే మళ్లీ టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. చివరగా 2020లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ గూటికి చేరారు. కానీ ఆ పార్టీలో సరైన గుర్తింపు రావడంలేదంటూ ఇప్పుడు బీజేపీకి కూడా రాజీనామా చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేసేందుకు ఇటీవల 40 మందితో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్‌ను ప్రకటించింది. అందులో విజయశాంతి పేరు లేకపోవడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. జరిగిన తప్పును గుర్తించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్టార్ క్యాంపెయినర్‌గా ఎమ్మెల్యే రఘునందన్‌తో పాటు విజయశాంతి ని నియమిస్తున్నట్లు ప్రకటించింది. అయినా ఆమె సంతృప్తి చెందలేదు. దీంతో చాలా కాలం నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
KTR: చంద్రబాబు, వైఎస్సార్‌పై కేటీఆర్ ప్రశంసలు.. ఆచితూచి మాట్లాడుతున్న కేటీఆర్
ఈ క్రమంలోనే బీజేపీకి విజయశాంతి (Vijayashanti) రాజీనామా చేసినట్లు సమాచారం. కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో వేదికపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉండడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. తెలంగాణ ద్రోహులతో కలిసి వేదికను పంచుకోలేకనే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు విజయశాంతి ట్విట్టర్‌లో తెలిపారు. అప్పటి నుంచి ఆమె పార్టీ రాష్ట్ర నాయకత్వం తీరుపై గుర్రుగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా బీజేపీకి వ్యతిరేకంగా వరుస ట్వీట్‌లు చేస్తూ.. అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ నెల 11న అణగారిన వర్గాల విశ్వరూప మహాసభకు హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీకి బేగంపేట్ ఎయిర్ పోర్టులో విజయశాంతి స్వాగతం పలికారు. మోదీకి స్వాగతం పలికిన నాలుగు రోజుల్లోనే విజయశాంతి పార్టీకి రాజీనామా చేయడం చర్చకు దారితీసింది.