BJP MLAs : బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎందుకు ప్రమాణం చేయలేదంటే..!
తెలంగాణ మూడో అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఎదుట ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. MIM కు చెందిన అక్బరుద్దీన్ ఎదుట తాము ప్రమాణం చేసేది లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ – MIM లోపాయికారి ఒప్పందంతోనే అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.

Telangana Ministers : తెలంగాణ మంత్రుల శాఖలు ఇవే !
అసెంబ్లీలో జరిగిన కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు. MIM కు చెందిన అక్బురుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ చేయడంపై వారు నిరసన తెలిపారు. సభలో సీనియర్ ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నా… అక్బరుద్దీన్ ను ఆ సీటులో ఎందుకు కూర్చొబెట్టారని ప్రశ్నించచారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. తాను ఎట్టి పరిస్థితుల్లో ఆయన ముందు ప్రమాణం చేయబోనని తేల్చిచెప్పారు. కిషన్ రెడ్డి సూచనతో మిగతా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదు.
ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ను ఎంపిక చేయడంపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ వ్యవహారంతో కాంగ్రెస్, మజ్లిస్ మద్య లోపాయికారి ఒప్పందం బయటపడిందని ఆరోపించారు. సీనియర్ ఎమ్మెల్యేలను కాదని… ఏ ప్రాతిపదికన అక్బర్ ను ఎంపిక చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తన పాత అలవాటు ప్రకారం శాసనసభ గౌరవాన్ని కాలరాసిందన్నారు కిషన్ రెడ్డి. అక్బర్ ను ప్రొటెం స్పీకర్ చేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక అయ్యాకే… తమ ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మినా… దగ్గినా పడిపోతుంది. అందుకే మజ్లిస్ ను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు.