TPCC Chief : పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ని మారుస్తారా..?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావడంలో పీసీసీ చీఫ్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా ఉన్నారు. ఆయన పీసీసీ పగ్గాలు చేపట్టాక హస్తం పార్టీ జోరందుకుంది. పదేళ్ళుగా నిస్తేజంగా ఉన్న పార్టీలో జోష్ నింపి.. అధికారం దాకా తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. వాటితో పాటు PCC చీఫ్ గా కాంగ్రెస్ పార్టీని చూడటం కష్టమే. పైగా జోడు పదవుల సంప్రదాయం అనేది కాంగ్రెస్ లో లేదు. మరి రేవంత్ ను కంటిన్యూ చేస్తారా.. ఆయన వారసుడిగా ఎవరిని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేస్తుంది అన్నదానిపై చర్చ నడుస్తోంది.

తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. కానీ పీసీసీ చీఫ్ గా రేవంత్ స్థానంలో మరొకరిని కూర్చోబెడుతుందా.. లేదంటే పార్లమెంట్ ఎన్నికల దాకా కంటిన్యూ చేస్తుందా అన్నది కాంగ్రెస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ఎంతో టైమ్ లేదు. ఈ నాలుగు నెలల్లోనే మళ్లీ వేరే వ్యక్తికి పీసీసీ పగ్గాలు అప్పగించాలా వద్దా అన్న డైలమాలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. రేవంత్ నే కంటిన్యూ చేయవచ్చని ఆయన అనుచరులు కొందరు చెబుతున్నారు.
ఒకవేళ రేవంత్ ను మారిస్తే.. ఆయన వారసులుగా ఎవరిని ఎంపిక చేయాలి ? పీసీసీ చీఫ్ పదవి మీద చాలామంది సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ ఈ రేసులో ఉన్నారు. భట్టి సీఎల్పీ లీడర్ గా పనిచేసిన అనుభవం ఉంది. పాదయాత్ర ద్వారా జనంలోకి వెళ్లారు. దళిత సామాజిక వర్గానికి చెందినవారు. అందుకే భట్టికి పీసీసీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు పీసీసీ చీఫ్ గా ఉన్నారు. అందువల్ల తెలంగాణలోనూ అదే పద్దతి కంటిన్యూ చేయవచ్చని అంటున్నారు. ఉత్తమ్ గతంలోనూ పీసీసీ చీఫ్ గా పనిచేశారు. మళ్ళీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
ఇక మరో మంత్రి, బీసీ లీడర్ పొన్నం ప్రభాకర్ కూడా పార్టీ బాధ్యతలు తీసుకోడానికి సంసిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఎల్బీనగర్ నుంచి ఓడిపోయిన మధుయాష్కీ.. రాహుల్ గాంధీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కి కూడా టీపీసీసీ చీఫ్ గా అవకాశం ఇస్తుంటారు. అలా చూసుకుంటే వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా పొన్నం ప్రభాకర్ తో పాటు.. మహేశ్ కుమార్ గౌడ, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి ఉన్నారు. వీళ్ళల్లో ఎవరైనా ఇచ్చే అవకాశముంది. కానీ మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళకే పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ హైకమాండ్ ఇంట్రెస్ట్ చూపిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇవేమీ లేకుండా సార్వత్రిక ఎన్నికల దాకా రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా కంటిన్యూ కూడా చేయవచ్చు.