వర్కవుట్ కాని బీఆర్ఎస్ ప్లాన్స్.. అంచనాలు దెబ్బతీసిన బీజేపీ..
తెలంగాణలో ఊహించని విధంగా దెబ్బతిన్న పార్టీ బీజేపీయే. ఎన్నికలకు మూడు నెలల ముందు దాకా ఓ రేంజ్ లో ఉన్న బీజేపీ గ్రాఫ్.. స్వయం కృతాపరాధంతో మూడో స్థానానికి పడిపోయింది. అంతేకాదు.. 20 కు పైగా స్థానాల్లో ఓట్లు చీలుస్తుందని అనుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం ద్వారా పరోక్షంగా బీఆర్ఎస్ గెలుపునకు కారణం అవుతుందని కూడా భావించారు. కానీ ఆ అంచనాలన్నీ తారుమారు అయ్యాయి. బీజేపీతో బీఆర్ఎస్ కు లాభం రాకపోగా.. భారీ నష్టమే కలిగింది.

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీ ఇస్తుందని అనుకున్నారు. కానీ ఆ పార్టీకి ఊహించినన్ని స్థానాలు కూడా రాలేదు. పైగా చాలా జిల్లాల్లో మెజార్టీలపై ప్రభావం చూపిస్తుందని కూడా భావించారు. దాదాపు 20 నియోజకవర్గాల్లో బీజేపీ బలంగా ఉందనీ.. ఆ సీట్లల్లో పార్టీ అభ్యర్థులు 15 నుంచి 20 వేల ఓట్లు దాకా తెచ్చుకుంటారు. దాంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట చీలిపోతుంది. అది పరోక్షంగా బీఆర్ఎస్ కే లాభం చేకూరుస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థుల ఓట్లకు గండిపడుతుంది అని విశ్లేషకులు భావించారు. కానీ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు చూస్తే అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ డిజిట్ కూడా దాటలేదు. పైగా ఇతర నియోజకవర్గాల్లోనూ బీజేపీ అభ్యర్థులు అనుకున్న స్థాయిలో ఓట్లు పొందలేకపోయారు. చాలా చోట్ల మూడే స్థానమే తప్ప రెండులో కూడా కనిపించలేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఎక్కువగా నడిచింది. మరి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలుస్తుంది అనుకున్న బీజేపీ ఎందుకు వెనకబడింది. అంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకు సాలిడ్ గా ఆ పార్టీకే ఉంది. బీఆర్ఎస్ కు పడాల్సిన ఓట్లనే బీజేపీ చీల్చుకుంది. దాంతో బీజేపీ వల్ల లాభపడతాం అనుకున్న గులాబీ బాస్ కి కమలం పార్టీ రూపంలో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. బీజేపీ వల్ల అనూహ్యంగా దెబ్బతిన్నది మాత్రం బీఆర్ఎస్సే. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసుకున్న అంచనాలు అందుకే తారుమారు అయ్యాయని తెలుస్తోంది.