YS SHARMILA: గురితప్పిన బాణం.. చేతులెత్తేసిన షర్మిల.. తెలంగాణలో పార్టీ ఖేల్ ఖతం..!

వైయస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి భూకంపం పుట్టిస్తాను అన్న షర్మిల చివరికి పార్టీని మడత పెట్టేసింది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించి రాజకీయంగా చేతులెత్తేసింది. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్లు.. వైయస్ఆర్ పేరు చెప్పుకొని తెలంగాణలో రాజకీయం చేద్దామనుకున్న షర్మిల చివరికి ఓ మూల కూర్చోవలసి వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 3, 2023 | 06:49 PMLast Updated on: Nov 03, 2023 | 6:51 PM

Ys Sharmila Quits Telangana Poll Race Will Her Political Career Ended

YS SHARMILA: తెలంగాణ (TELANGANA)లో రాజన్న రాజ్యం తెస్తా.. సీఎం కుర్చీలో కూర్చుంటా.. నేను తెలంగాణ కోడల్ని.. ప్రజలు నన్ను కోరుకుంటున్నారు… నన్ను ఎవడు ఆపుతాడో చూస్తా.. ఇవీ కొన్ని నెలల క్రితం వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల (YS SHARMILA) నినాదాలు. వైయస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP) పెట్టి భూకంపం పుట్టిస్తాను అన్న షర్మిల చివరికి పార్టీని మడత పెట్టేసింది. తెలంగాణ ఎన్నికల్లో (ASSEMBLY ELECTIONS) కాంగ్రెస్‌కి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించి రాజకీయంగా చేతులెత్తేసింది. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్లు.. వైయస్ఆర్ పేరు చెప్పుకొని తెలంగాణలో రాజకీయం చేద్దామనుకున్న షర్మిల చివరికి ఓ మూల కూర్చోవలసి వచ్చింది.

JANASENA: వెనక్కి తగ్గిన పవన్..? తెలంగాణలో జనసేన పోటీ కష్టమే..!

ఒక రాజకీయ పార్టీ పెట్టడం.. దాన్ని నడపడం.. ప్రజల్లో నిత్యం ఆ పార్టీని మనుగడలో పెట్టడం అంత ఆషామాషీ కాదు. పైగా స్పేస్ లేని చోట రాజకీయం చేయాలనుకోవడం ఇంకా సాహసం. అలాంటి పని చేసి షర్మిల పొలిటికల్ కమెడియన్‌గా మిగిలిపోయింది. 3700 కిలోమీటర్లు ఎందుకు పాదయాత్ర చేసిందో ఆమెకే తెలియదు. ఆమె పాదయాత్రకు పెద్ద రెస్పాన్స్ వచ్చింది కూడా లేదు. ప్రెస్‌మీట్‌లు పెట్టి కెసిఆర్ అవినీతిని లేవనెత్తడం తప్ప షర్మిల చేసింది సున్నా. అన్న జగన్‌మోహన్ రెడ్డితో ఆస్తుల పంపకంలో, అధికారాల పంపకంలో వచ్చిన మనస్పర్ధలతో తెలంగాణలో రాజకీయం చేసిన షర్మిల.. లక్ష్యంలేని బాణంలా పయనించింది. వైయస్ బొమ్మ పెడితే చాలు ఓట్లు వచ్చి పడిపోతాయని భ్రమల్లో ఉన్న విజయమ్మ కూతురి కోసం కొడుకు జగన్‌ను కూడా వదులుకొని, ఏపీలో వైసీపీకి రాజీనామా చేసి తెలంగాణ వచ్చి కూర్చుంది. రెడ్లు, మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలు మొత్తం తన వెనక వచ్చేస్తారని షర్మిల రాంగ్ ఎస్టిమేషన్ వేసుకుంది. దీనికి తోడు షర్మిల పార్టీ పెడతాను అన్న రోజు నుంచి ఆమె చుట్టూ చేరిన కొందరు అనుచరులు, ఒకరిద్దరు మీడియా అధిపతులు, ఎడిటర్లు, రిపోర్టర్లు ఎవరికి వీలైనంతవాళ్లు దోచేశారు.

Telangana BJP : బీజేపీలో వింత సమస్య.. మాకు టికెట్లు వద్దు అంటూ కొందరు.. వారికి వద్దు అంటూ మరికొందరు..

వాళ్ళు ఇచ్చిన చౌకబారు ఐడియాలు, సలహాలు షర్మిలని నట్టేట ముంచాయి. పాదయాత్రలో ప్రతిరోజు ఒక వివాదం లేపడం ద్వారా తనకు మీడియా అటెన్షన్ వచ్చేటట్లు చేసుకోగలిగింది షర్మిల. అంతకుమించి ఒరిగిందేమీ లేదు. తెలంగాణ అంతా పోటీ చేస్తానని కాసేపు, ఆలేరులో దిగుతానని మరికొంత సేపు ఇలా రకరకాల ప్రకటనలు ఇచ్చి గందరగోళం సృష్టించారు షర్మిల. చివరకు కాంగ్రెస్‌లో వైఎస్ఆర్‌టిపిని కలిపేయడానికి సిద్ధమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్‌లో కొందరు రెడ్లు కూడా షర్మిలని ప్రోత్సహించారు. షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తే పార్టీలో రేవంత్ రెడ్డికి చెక్ పెట్టొచ్చని ఆశించారు. కానీ రేవంత్ షర్మిలని ఏపీ పంపించాలని కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. షర్మిలని పార్టీలో చేర్చుకోవడం ద్వారా కొత్త సమస్య కొని తెచ్చుకోవడమేనని గ్రహించింది. ఆమెకు నో చెప్పేసింది. దీంతో మరో కొత్త డ్రామాకి తెరతీసింది షర్మిల. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తానని.. తన వలన ఓట్లు చీలిపోతే నష్టం మీకేనని కాంగ్రెస్‌ను హెచ్చరించింది. అయినా కాంగ్రెస్ పట్టించుకోకపోవడంతో చివరికి ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేసి తెలంగాణలో అసలు పోటీ చేయట్లేదు. కాంగ్రెస్‌కి మద్దతిస్తున్నట్లు చెప్పుకొస్తుంది. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తుంది షర్మిల.

కానీ అసలు విషయం ఏంటంటే తెలంగాణలో షర్మిల ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్ దక్కదు. ఈ నిజాన్ని దాచి ఇంతకాలం ఆమెను భ్రమల్లో ఉంచింది ఆమె చుట్టూ ఉన్న మీడియా సలహాదారుల బృందం. చివరికి బాణం వంకర తిరిగిపోయింది. ఎటు నుంచి ఎటు వెళ్లాలో చాలా తెలియక కింద పడిపోయింది. తెలంగాణ రాజకీయాల్లో షర్మిల అంకం ముగిసిపోయింది. ఓవరాల్‌గా షర్మిల పొలిటికల్ ఎపిసోడ్‌లో పూర్తిస్థాయి లాభం పొందింది ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఆయన్ని వదిలి వచ్చిన రోజు నుంచి ఎన్నడు పెదవి విప్పని జగన్ జరుగుతున్నదంతా గమనిస్తూనే ఉన్నారు. తన చెల్లెలు శక్తి ఎంతో ఆమె స్వయంగా తెలుసుకునేటట్లు చేయగలిగారు జగన్‌.