CM Revanth: 10 కోట్లు ఇస్తా.. పండగ చేస్కోండి ! MLAలకు రేవంత్ బంపరాఫర్ !!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్యేలకు బంపరాఫర్ ఇచ్చింది. ఒక్కో ఎమ్మెల్యేకు నియోజకవర్గ అభివృద్ధి కోసం 10 కోట్ల రూపాయలను ప్రకటించారు. నియోజకవర్గ స్థాయిలో హామీల అమలుకు ఈ ప్రత్యేక నిధిని ఇస్తామన్నారు. నిధుల బాధ్యతలను ఇన్ ఛార్జ్ మంత్రులకు అప్పగిస్తారు. వారితో సమన్వయం చేసుకుంటూ.. ఆయా నియోజకవర్గాల్లో MLAలు అభివృద్ధి పనులు చేసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 10, 2024 | 10:09 AMLast Updated on: Jan 10, 2024 | 1:16 PM

10 Crores Will Be Given Have A Festival Revant Bumperafar For Mlas

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్యేలకు బంపరాఫర్ ఇచ్చింది. ఒక్కో ఎమ్మెల్యేకు నియోజకవర్గ అభివృద్ధి కోసం 10 కోట్ల రూపాయలను ప్రకటించారు. నియోజకవర్గ స్థాయిలో హామీల అమలుకు ఈ ప్రత్యేక నిధిని ఇస్తామన్నారు. నిధుల బాధ్యతలను ఇన్ ఛార్జ్ మంత్రులకు అప్పగిస్తారు. వారితో సమన్వయం చేసుకుంటూ.. ఆయా నియోజకవర్గాల్లో MLAలు అభివృద్ధి పనులు చేసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో తన మార్క్ చూపించబోతున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చింది. ఆ హామీలను నెరవేర్చేందుకు ప్లాన్ చేస్తున్నారు రేవంత్. ఆరు గ్యారంటీల్లో రెండింటిని అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరో రెండు స్కీమ్స్ సంక్రాంతికి ప్రారంభిస్తారని అనుకుంటున్నారు. అటు నియోజకవర్గాల వారీగా కూడా నిధులను కేటాయిస్తున్నారు సీఎం రేవంత్. ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయల ప్రత్యేక నిధిని హామీల అమలు కోసం ఇస్తున్నారు. జిల్లాల ఇంఛార్జ్ మంత్రులతో కలసి ప్రతి ఒక్క ఎమ్మెల్యే తమ నియోజకవర్గాల్లో సమస్యలను పరిష్కరించుకోవావాలి. లోక్ సభ ఎన్నికల కోడ్ వచ్చే లోపు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. దాంతో పనిచేస్తామన్న నమ్మకాన్ని జనానికి కల్పించాలన్నది ఆయన ఆలోచన. జనంలో వచ్చే ఆ టాక్.. లోక్ సభ ఎన్నికల్లో ఓట్లుగా మారతాయని భావిస్తున్నారు.

రాష్ట్రంలో త్వరలో ఇందిరమ్మ కమిటీలు కూడా ఏర్పాటవుతున్నాయి. ఈ కమిటీల ద్వారా నిజమైన లబ్దిదారులను గుర్తించి వారికి స్కీములు అందేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ చెబుతున్నారు. ప్రతి గ్రామంలో గ్రామస్థాయిలో ఇలాంటి కమిటీలను ఏర్పాటు చేయడం వల్ల లబ్దిదారుల గుర్తింపు ఈజీ అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్ మంత్రులతో సీఎం రేవంత్ సమావేశం జరిగింది. నియోజకవర్గాల్లో మీరు కోరుకున్న అధికారులను ఇస్తాం… కానీ నిజాయతీగా పనిచేసేవారిని మాత్రమే ఎన్నుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు రేవంత్. అవినీతి అధికారులను ప్రోత్సహించవద్దు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన తప్పులు మనం చేయొద్దని.. మంచి పేరు కోసం పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అవినీతి అధికారులకు BRS ఎమ్మెల్యేలు, మంత్రులు అండగా నిలబడ్డారని గతంలో చాలా ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆ మచ్చ తమ ఎమ్మెల్యేలపై పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. అలాగే సంక్రాంతి తర్వాత లోక్ సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించబోతున్నారు. రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లే లక్ష్యంగా పనిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.