మండిపోతున్న ఎండలు, తెలంగాణలో ఒకే రోజు 11 మంది మృతి
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. గడిచిన 24 గంటల్లోనే వడదెబ్బ కారణంగానే ఏంకగా 11 మంది చనిపోయారు.

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. గడిచిన 24 గంటల్లోనే వడదెబ్బ కారణంగానే ఏంకగా 11 మంది చనిపోయారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. పెద్దపల్లి, ఆసిఫాబాద్, సూర్యాపేట, నిర్మల్, కరీంనగర్, వరంగల్, జనగామ, ములుగు. ఇలా జిల్లాకు ఒకరు చొప్పున ఎండ తీవ్రతను తట్టుకోలేక చనిపోయారు.
వారం క్రితం కాస్త వర్షాలు పడ్డా.. కొన్ని రోజుల నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. రోజు రోజుకూ ఉష్టోగ్రతలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 45.2 డిగ్రీల ఉష్టోగ్రత నమోదవుతోంది. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్న వాతావరణ శాఖ అధికారులు.